Health Tips: చాలామంది ఉదయం లేవగానే కడుపు ఉబ్బరంగా ఉంది అంటూ బాధపడుతూ ఉంటారు. మరికొందరు రాత్రి తిన్న ఆహారం సరైన విధంగా జీర్ణం కాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇందుకు కారణం రాత్రి తీసుకున్న ఆహారమే అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది రాత్రి సమయంలో కడుపులో ఉన్న స్థలం కంటే ఎక్కువగా ఆహారాన్ని తీసుకొని ఆ తర్వాత ఉదయం బాధపడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది శారీరక శ్రమ ఎక్కువ చేయడం లేదు. దీంతో తీసుకున్న ఆహారం అనుకున్న స్థాయిలో జీర్ణం కావడం లేదు. దీంతో రాత్రి సమయంలోనే లైట్ ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇందులోను ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి నశించకుండా ఉంటుంది. మరి రాత్రి పడుకునే ముందు ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఎనర్జీ ఉంటుంది?
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగం, వ్యాపారం కారణంగా చాలామంది బిజీగా ఉంటారు. దీంతో సమయానికి అనుకూలంగా ఆహార పదార్థాలను తీసుకోవడం లేదు. టైం ప్రకారం ఆహారం తీసుకోకపోవడంతో పాటు సమయపాలన లేకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల కడుపులో ప్రళయం ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల సరైన నిద్ర రాకపోవడంతో పాటు ఉదయం అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొంతమంది రాత్రి సమయంలో పార్టీలు లేదా ఇతర కారణాలవల్ల చికెన్, మటన్ వంటి పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. వీటితోపాటు ఐస్ క్రీమ్, పిజ్జా, బర్గర్, కేక్స్, కూల్ డ్రింక్స్ వంటివి తాగుతూ ఉంటారు. వీటివల్ల కడుపులో త్వరగా జీర్ణమయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవి తీసుకునేవారు దాదాపు శారీరక శ్రమ చేసేవారు ఉండరు. వీటిని తిని వెంటనే పడుకోవడం వల్ల అవి జీర్ణం కాకుండా అలాగే ఉండిపోయి చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. అయితే రాత్రి సమయంలో తీసుకున్న ఆహారం ఉదయం త్వరగా జీర్ణం కాకుండా అలాగే ఉండిపోవడంతో కడుపులో ఏదో జరుగుతున్నట్లు అసౌకర్యంగా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. వీటిలో క్యారెట్, బీట్రూట్, టమాటా వంటి సూట్స్ తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీతోపాటు జీర్ణం కావడానికి సులభంగా ఉంటుంది. అలాగే ఆహారం తినకుండా ఉండలేం అనేవారు రాత్రి సమయంలో అన్నం తో పాటు పప్పు కల్పిన ఆహారం తీసుకోవడం వల్ల కడుపులో బరువుగా ఉన్నట్లు అనిపించదు. తక్కువ నూనెతో తయారుచేసిన ఆహార పదార్థాలు, ఫైబర్ ఎక్కువగా ఉండే జీర్ణానికి సులభంగా ఉండే వాటిని తీసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే గంట ముందు గోరువెచ్చని పాలు తీసుకోవచ్చు.