Skin Care Tips: అరటి పండును ఇష్టపడనివారు ఉంటారా? అందరి ఇష్టానికి అనుగుణంగానే ప్రయోజనాలు కూడా మెండుగా ఉంటాయి. మరి ఆరోగ్యానికే కాదండోయ్ చర్మానికి కూడా మంచి ఫ్రూట్ బనానా. ఇందులో కెరోటిన్, విటమిన్ ఇ, బి1, సి, బి,పొటాషియం లు ఫుల్ గా ఉంటాయట. దీంతో చర్మంపై సహజ మెరుపు సులభంగా వస్తుంది అంటున్నారు స్కిన్ స్పెషలిస్టులు. చర్మం ముడతలు పడిన, మొటిమలతో ఇబ్బంది పడినా అరటి ఫేస్ ప్యాక్ ను ఓసారి ట్రై చేయాల్సిందే అంటున్నారు నిపుణులు.
ముడతలను తగ్గించడంలో నెంబర్ వన్ నివారిణి అరటి పండు. అంతేకాదు చర్మ సమస్యలను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. ఇంతకీ ఈ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అన్నం వడ్డించాకా కూర వడ్డించరా చెప్పండి. మేము ఉన్నాం కదా.. ఓ సారి ఇది కూడా చదివేయండి. అరటి ఫేస్ ప్యాక్ కోసం పెరుగు మస్ట్. పెరుగు చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. మచ్చలుగా మారిన గుర్తులను మాయం చేస్తుంది.
అంతేకాదు అరటి ఫేస్ ప్యాక్ లో తేనె కూడా ఉండాల్సిందే. తేనె వల్ల చర్మ కణాలు రిపేర్ అవుతాయి. ఫైన్ లైన్స్ గుర్తులు ఇట్టే మాయం అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మూడింటితో ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. అయితే అరటిపండును బాగా మగ్గించాలి. ఇందులో ఒక చెంచా పెరుగు, నారింజ రసం, తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఓ పదినిమిషాలు అలా వదిలేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేశారంటే నేచురల్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
రోజ్ వాటర్ అరటి ప్యాక్..
రోజ్ వాటర్ చాలా మంది వాడుతున్నారు. అరటిపండులో ఉండే విటమిన్ ఇ, పొటాషియం చర్మంపై ముడతలను తగ్గిస్తే.. రోజ్ వాటర్ చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. పండిన అరటి పండును మెత్తగా చేసి ఆపై పచ్చి పాలు, రోజు వాటర్, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోవాలి. కుదిరితే తేలికపాటి మాయిశ్చరైజర్ రాసుకోండి. దీన్ని వారంలో 2-3 సార్లు అప్లై చేయండి ఆ తర్వాత రిజల్ట్ మీరే చూస్తారు.