https://oktelugu.com/

గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

మన దేశంలో రోజురోజుకు గ్రీన్ టీ తాగే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. టీ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని భావించే వాళ్లలో ఎక్కువ మంది గ్రీన్ టీ తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కూడా గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడైంది. బరువును తగ్గించడంలో గ్రీన్ టీ అద్భుతంగా సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి చేస్తాయి. Also Read: కొబ్బరి నూనెతో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 16, 2021 12:15 pm
    Follow us on

    Green Tea

    మన దేశంలో రోజురోజుకు గ్రీన్ టీ తాగే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. టీ ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని భావించే వాళ్లలో ఎక్కువ మంది గ్రీన్ టీ తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కూడా గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వెల్లడైంది. బరువును తగ్గించడంలో గ్రీన్ టీ అద్భుతంగా సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి చేస్తాయి.

    Also Read: కొబ్బరి నూనెతో సులభంగా బరువు తగ్గవచ్చు.. ఎలా అంటే..?

    వారానికి మూడు రోజులు గ్రీన్ టీ తాగితే మనిషి లైఫ్ టైమ్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. గ్రీన్ టీ తాగడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అధ్యయనంలో వెల్లడైంది. ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో గ్రీన్ టీ తోడ్పడుతుంది.

    Also Read: కీర దోసకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజాలివే..?

    గ్రీన్ టీ జీవక్రియ రేటును పెంచి శరీరంలో ఉన్న అదనపు కొవ్వును వులువుగా కరిగిస్తుంది. చైనా దేశంలో శాస్త్రవేత్తలు దాదాపు లక్ష మందిపై పరిశోధనలు చేసి గ్రీన్ టీ తాగిన వారు సగటున 1.26 సంవత్సరాలు ఎక్కువగా జీవించారని వెల్లడించారు. ఎక్కువమంది బ్లాక్ టీని ఇష్టపడతారని అయితే బ్లాక్ టీ కంటే గ్రీన్ టీనే మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    శరీరంలో క్యాన్సర్ కణాలను అభివృద్ధి చెందకుండా నిరోధించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది. రోజూ కాఫీ, టీలను తాగేవాళ్లు వాటికి బదులుగా గ్రీన్ టీని తీసుకుంటే మంచిది. గ్రీన్ టీలో సూక్ష్మజీవుల వల్ల కలిగే చెడు ప్రభావాన్ని అరికట్టే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కీళ్ల నొప్పులు కీళ్ళ వాపుల నుంచి ఉపశమనం కలిగించడంలో గ్రీన్ టీ సహాయపడుతుంది.