https://oktelugu.com/

Coconut Water: కొబ్బరినీళ్లు తాగడం వల్ల గుండె జబ్బులు దూరమే?

Coconut Water: ప్రస్తుతం ఎండాకాలం వచ్చేసింది. ఎండ తాపం పెరుగుతోంది. దీంతో శరీరం అలసటకు గురవుతుంది. ఎండ వేడిమికి వడదెబ్బ సోకే అవకాశాలు ఉంటాయి. బాడీ డీ హైడ్రేషన్ కు గురైతే వడదెబ్బ తగలడం కామన్. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తగినన్ని మంచినీళ్లు తాగాలి. కొబ్బరిబొండాలు తీసుకోవాలి. ఈ కాలంలో కొబ్బరి బొండాల పాత్ర ముఖ్యమైనది. కొబ్బరినీరు మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. రోజు కొబ్బరినీరు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అపోహలేంటి? కొబ్బరినీళ్లు మధుమేహులు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 12, 2023 / 03:21 PM IST
    Follow us on

    Coconut Water

    Coconut Water: ప్రస్తుతం ఎండాకాలం వచ్చేసింది. ఎండ తాపం పెరుగుతోంది. దీంతో శరీరం అలసటకు గురవుతుంది. ఎండ వేడిమికి వడదెబ్బ సోకే అవకాశాలు ఉంటాయి. బాడీ డీ హైడ్రేషన్ కు గురైతే వడదెబ్బ తగలడం కామన్. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తగినన్ని మంచినీళ్లు తాగాలి. కొబ్బరిబొండాలు తీసుకోవాలి. ఈ కాలంలో కొబ్బరి బొండాల పాత్ర ముఖ్యమైనది. కొబ్బరినీరు మన ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. రోజు కొబ్బరినీరు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

    అపోహలేంటి?

    Coconut Water

    కొబ్బరినీళ్లు మధుమేహులు తాగితే షుగర్ లెవల్స్ పెరుగుతాయని చెబుతుంటారు. ఇది అపోహే. కొబ్బరినీళ్లలో షుగర్ లెవల్స్ పెంచే గుణాలు లేవు. చక్కెరను తగ్గించేందుకు సాయపడుతుంది. అందుకే షుగర్ పేషెంట్లు కూడా నిరభ్యంతరంగా కొబ్బరి నీళ్లు తాగొచ్చు. ఇంకా రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. ఎవరైనా కొబ్బరి బొండాలు తాగొచ్చు. ఎండాకాలంలో మన శరీరాన్ని కాపాడేది కొబ్బరి బొండాలే. ఒక కొబ్బరి బొండాం తాగితే మన ఓ సెలాన్ బాటిల్ ఎక్కించుకున్న శక్తి వస్తుందంటే ఎవరు నమ్మరు.

    పోషకాల గని

    కొబ్బరిబొండాలంలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతం నీరే ఉండటం వల్ల మనకు ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇంకా పొటాషియం అధిక మొత్తంలో ఉండటంతో మన మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. మన ఆరోగ్య వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. దీంతో ఎండాకాలంలో విరివిగా బొండాలు తాగడం మంచిది. జీర్ణవ్యవస్థను వేగవంతం చేసి మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు దాగి ఉన్న కొబ్బరి బొండాం కాదని శీతల పానీయాలు తీసుకోవడం వెర్రితనమే.

    కొబ్బరి నీళ్లలో ఏముంటాయి?

    250 ఎంఎల్ కొబ్బరి నీళ్లలో 9 గ్రాముల పిండి పదార్థాలు, 3 గ్రాముల ఫైబర్, 17 శాతం పొటాషియం, 11 శాతం సోడియం ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో లివర్ కు మేలు చేస్తుంది. ఎసిడిటితో బాధపడేవారు వీటిని తీసుకోవడం ఉత్తమం. కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తాయి. మన ఇమ్యూనిటీ శక్తిని బలోపేతం చేస్తుంది. గర్భిణులు కూడా కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఎంతో లాభం కలుగుతుంది. ఇలా కొబ్బరి నీళ్లు మన శారీరక వ్యవస్థను బలోపేతం చేసే ఆహారంగా నిలుస్తుంది.

    గుండె జబ్బులను దూరం చేస్తుంది

    కొబ్బరినీళ్లు తాగడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. బీపీని కంట్రోల్ ఉంచడంతో గుండె జబ్బుల ముప్పును దూరం చేస్తాయని తేలింది. మన రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. అందుకే కొబ్బరి బొండాలను తరచుగా తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తుండటంతో కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.