Colgate Toothpaste: కాలం మారుతున్న కొద్ది మార్కెట్లోకి కల్తీ వస్తువుల సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటికే అల్లం, నూనె వంటి కల్తీ వస్తువులు మార్కెట్లోకి రాగా.. ఇప్పుడు కొత్తగా టూత్ పేస్టులు కూడా వస్తున్నాయి. తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని katch జిల్లాలో భారీగా నకిలీ టూత్ పేస్టులు బయటపడ్డాయి. ఇవి ప్రముఖ Colgate పేరుతో ఉండడం విశేషం. వీటి విలువ 9.45 లక్షలు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొందరు ప్రత్యేకంగా మిషిన్ ను ఏర్పాటు చేసుకొని నకిలీ టూత్ పేస్ట్ ను తయారు చేస్తూ.. వాటికి ప్రముఖ కంపెనీ కి చెందిన ప్యాకింగ్ చేసి మార్కెట్లోకి వదిలారు. అయితే పోలీసులు ముందుగానే గ్రహించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు.
ఉదయం లేవగానే చాలామంది ముందుగా నోటిని శుభ్రం చేసుకోవడానికి టూత్ పేస్ట్ ను వాడుతారు. అయితే ప్రముఖ కంపెనీ అయినా కోల్గేట్ ను చాలామంది యూస్ చేస్తారు. ఈ టూత్ పేస్ట్ ను నకిలీగా తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసి గుర్తించని ప్రాంతాల్లో విక్రయించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే నకిలీ టూరిస్ట్ లు ఎక్కడెక్కడ పంపిణీ చేశారు అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే దీని చైన్ సిస్టం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ప్రతి వస్తువు కల్తిమయంగా మారిపోతుంది. దీంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రముఖ కంపెనీ పేరుతో అల్లం మార్కెట్లోకి రావడంతో దానిని గుర్తించారు. అలాగే మినరల్ వాటర్ కూడా పేర్లు మార్చి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు నిత్యవసరంగా ఉండే టూత్ పేస్ట్ కూడా మార్కెట్లోకి రావడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే ఈ టూత్ పేస్ట్ లో ప్రమాదకరమైన పదార్థాలు వాడినట్లు తెలుస్తోంది.
ఈ టూత్ పేస్టు ముందుగా పరిశీలించి ప్రముఖ కంపెనీ దగ్గరికి వెళ్లి ఆరా తీయగా ఇది తమది కాదని తేల్చడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
ఇక టూత్ పేస్టులు కొనుగోలు చేసే సమయంలో సాధారణ కిరణా షాపుల్లో కాకుండా ప్రముఖ షాపింగ్ మాల్ లేదా సూపర్ మార్కెట్లో కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా టూత్ పేస్ట్ కొనుగోలు చేసే సమయంలో దానికి సంబంధించిన ప్యాకింగ్ ను పరిశీలించాలని అంటున్నారు. ఎవరైనా తక్కువ ధరకు టూత్ పేస్టు విక్రయిస్తే దాని గురించి పరిశీలన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. టూత్ పేస్టు అనుమానంగా కనిపిస్తే సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేయాలని అంటున్నారు. మొత్తంగా టూత్ పేస్ట్ వినియోగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.