Bigg Boss 9 Telugu Flora Saini Elimination: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో పెద్ద గా ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇవ్వకపోయినా కూడా హౌస్ లో కొనసాగుతూ వచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకరు ఫ్లోరా షైనీ. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టకముందే మొదటి వారం లోనే ఎలిమినేట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. మొదటి వారం సంజన తో గొడవ పడడం ఈమెకు బాగా కలిసొచ్చింది. ఇక ఆ తర్వాత కామనర్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ పై తీవ్రమైన నెగిటివిటీ రావడం తో, ప్రేక్షకులు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చారు. ఆ సమయం లో ఫ్లోరా సేవ్ అవుతూ వచ్చింది. కానీ ఈ వారం మాత్రం ఆమె ఎలిమినేట్ అయిపోయిందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. వాస్తవానికి ఈమెకు సేవ్ అయ్యేంత ఓటింగ్ పడింది. కానీ బిగ్ బాస్ యాజమాన్యం ఈమెని కచ్చితంగా బయటకు పంపేయాలని ఫిక్స్ అయిపోయారు.
అందుకే ఆమెను గత వారం లో అవసరం లేకపోయినా కూడా ఒక ప్రత్యేకమైన టాస్క్ ని నిర్వహించి వరుసగా రెండు వారాలు డైరెక్ట్ గా నామినేట్ అయ్యేలా చేశారు బిగ్ బాస్ టీం. ఈమెని బయటకు పంపడానికి ముఖ్య కారణం, ఆమె నుండి సరైన కంటెంట్ రావడం లేదని. పైగా హీరోయిన్ క్యాటగిరీ లో వచ్చిన కంటెస్టెంట్ కావడం తో ఆమెకు రెమ్యూనరేషన్ కూడా భారీ రేంజ్ లో ఇస్తున్నారట. వారానికి రెండున్నర లక్షల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకుందట బిగ్ బాస్ టీం. 5 వారాలు హౌస్ లో ఉంది కాబట్టి, ఈ 5 వారాలకు కలిపి 12 లక్షల 50 వేల రూపాయిలు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు కొనసాగితే బడ్జెట్ చాలా వృధా అవుతుందని, పైగా వైల్డ్ కార్డ్స్ ని భారీ ఖర్చు తో తీసుకొస్తున్నాము కాబట్టి, ఫ్లోరా ని ఓట్లతో సంబంధం లేకుండ బయటకు పంపడానికి నిర్ణయించుకున్నారని టాక్.
ఇదంతా పక్కన పెడితే ఫ్లోరా షైనీ ఎలాంటి నెగిటివిటీ లేకుండా, చాలా మర్యాదగా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. చివరి రెండు వారాల్లో ఆమె సంజన తో కలిసి చాలా అద్భుతంగా ఆడింది, తన కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వకుండా, హౌస్ మేట్స్ వివిధ సందర్భాల్లో ఆమెకు అన్యాయం చేసినప్పటికీ కూడా, ఆమె ఎప్పుడూ ఓవర్ డ్రామా చెయ్యలేదు. మనకి లక్ లేదు, పర్వాలేదు, ఏమి కాదు అంటూ నవ్వుతూ స్వీకరించేది. గతం లో ఎలిమినేషన్ డేంజర్ జోన్ కి వచ్చినప్పుడు కూడా ఆమె ముఖం ఇసుమంత భయం కూడా లేదు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తాను అనే విధంగా నడుచుకుంది. ఇలాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్స్ లో చాలా అరుదుగా దొరుకుతూ ఉంటారు. ఆమెకు భవిష్యత్తులో మంచి ప్రాజెక్ట్స్ రావాలని, పెద్ద రేంజ్ కి రావాలని కోరుకుందాం.