Black Dates Vs Red Dates: మార్కెట్లో లభించే సాధారణ ఆహార పదార్థాల కంటే పండ్లలో ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. అందుకే చాలామంది ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక ఉపవాసాల్లో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుని ఎనర్జిటిక్ గా ఉంటారు. అయితే రంజాన్ మాసంలో మార్కెట్లో ఎక్కువగా ఖర్జూరాలు కనిపిస్తూ ఉంటాయి. అన్ని ఖర్జూరాలు ఒకే రకంగా ఉండకుండా కొన్ని పచ్చిగా.. మరికొన్ని ఎండిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఖర్జూరాల్లో తేడా ఎందుకు? వీటిలో ఏది బెటర్?
ఖర్జూర పండులో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో పూర్తిగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా ఉపవాసాల్లో ఉపయోగిస్తారు. ఖర్జూరాల్లో 70% వరకు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అలాగే ఇందులో గ్లూకోస్, ప్రక్టోజ్, సూప్రోస్ వంటివి ఉంటాయి. అందుకే ఒక ఖర్జూరాను తీసుకుంటే తక్షణ శక్తి వస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నిలువలను నియంత్రిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, కాపర్ తోపాటు ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఖర్జూరాలో విటమిన్ బి6, విటమిన్ బి9, రైబోఫ్లేవిన్ వంటి విటమిన్ లో ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఖర్జూరాలు అనేక రకాలుగా ఉంటాయి. వీటిలో మొద్జుల్, దెగ్లెట్ నూర్, సాయిర్ వంటివి ఉంటాయి. అయితే మార్కెట్లో దొరికే ఖర్జూరాలు ఒకటి పచ్చివి గాను.. మరొకటి ఎండిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలా రెండు రకాలుగా ఎందుకు ఉంటాయని చాలామందికి ఇప్పటికే సందేహం వచ్చి ఉంటుంది. పచ్చిగా ఉండే ఖర్జూరాలను చెట్టు మీద పక్వానికి రాకముందే తీస్తారు. ఆ తర్వాత వీటిని ఉడికించి ప్రాసెస్ చేసి మార్కెట్లోకి తీసుకువస్తారు. వీటి ద్వారా తక్కువగా ఉంటుంది. కిలో రూ.150 నుంచి రూ.200 వరకు ఉంటుంది. అలాగే మిగతావి ఎండినట్లు ఉండే ఖర్జూరాలు ప్యాక్ చేసి వస్తుంటాయి. ఇవి చెట్టు మీదనే పక్వానికి వచ్చేవరకు ఉంచి ఆ తర్వాత తెంపి నేరుగా మార్కెట్లోకి తీసుకువస్తారు. వీటి ధర ఎక్కువగా ఉంటుంది. కిలో రూ.300 వరకు ఉంటుంది.
అయితే ప్రాసెస్ చేసిన ఖర్జూర కంటే నేరుగా మార్కెట్లోకి వచ్చే ఖర్జూరాలు ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఎక్కువగా రుచి ఉంటుంది. ప్రాసెస్ చేసిన వాటిలో కొన్నింటిలో మాత్రమే రుచికరంగా ఉంటుంది. అయితే తక్కువ ధరకు కావాలని అనుకునేవారు వాటిని కొనుగోలు చేస్తారు. ప్రోటీన్లు కావాలని అనుకునే వారు మాత్రం ఎక్కువ ధరలు చెల్లించాల్సిందే. ప్రాసెస్ చేసిన ఖర్జూరాలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ సి కలిగి ఉంటుంది. ఎండినట్లు ఉండే ఖర్జూరాలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇందులో నీటి శాతం తక్కువగా ఉండడంతో చక్కెర సమృద్ధిగా ఉంటుంది. రెండు రకాల ఖర్జూరాలు ఉపయోగమే అయినప్పటికీ.. ఎండు ఖర్జూరాలు తినడం వల్ల ఎక్కువగా పోషకాలను తీసుకున్న వారవుతారు.