మనలో చాలామందిని కొన్ని చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యలు చిన్నవే అయినా ఆ సమస్యల వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటాం. విటమిన్ల లోపం వల్లే ప్రధానంగా కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఎవరినైనా తరచూ చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటే ఫ్యాటీ యాసిడ్ల లోపం ఆ సమస్యకు కారణమని గుర్తుంచుకోవాలి. చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.
Also Read: చూయింగ్ గమ్‌తో బరువు సులువుగా తగ్గే ఛాన్స్.. ఎలా అంటే..?
కొన్ని సందర్భాల్లో అరుగుదల తగ్గడంతో పాటు పేగులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. పీచు, మెగ్నీషియం తగ్గితే పేగు సంబంధిత సమస్యలు వస్తాయి. బ్రొకోలి, యాపిల్స్ తినడం ద్వారా పేగు సంబంధిత సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. మరి కొంతమంది పని కొద్దిగా చేసినా కండరాల నొప్పులు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. మెగ్నీషియం, క్యాల్షియం లోపం వల్ల కండరాల నొప్పులు వస్తాయి.
Also Read: చలికాలంలో ఒంటినొప్పులకు చెక్ పెట్టే చిట్కాలివే..?
అవకాడో, అరటిపండులను రోజూ తీసుకోవడం ద్వారా సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టడంసాధ్యమవుతుంది. తరచూ చర్మం కందిపోవడం లేదా గాయాలు కావడం జరిగితే విటమిన్ సి లోపం వల్లే ఆ విధంగా జరిగిందని అనుకోవాలి. ఆహారంలో పుల్లటి పండ్లను చేర్చుకుంటే సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. వెంట్రుకలు ఎక్కువగా రాలిపోతుంటే ఆ సమస్యను బి విటమిన్ లోపంగా పరిగణించాలి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
బి విటమిన్ లోపంతో బాధ పడేవారిలో వెంట్రుకలు బలహీనపడటంతో పాటు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. బచ్చలికూర, పాలకూర తినడం ద్వారా సులభంగా బి విటమిన్ లోపంను అధిగమించవచ్చు.