High BP: ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలలో హై బీపీ కూడా ఒకటని చెప్పవచ్చు. దీర్ఘకాలిక గుండె జబ్బుల ప్రమాదాన్ని హై బీపీ పెంచుతుందనే సంగతి తెలిసిందే. ఒత్తిడి, ఆహార ఎంపికలు, ధమనుల సంకుచితం వల్ల రక్తప్రసరణ పెరిగితే దానిని హై బీపీ అంటారు. తక్కువ చక్కెర ఉన్న డైట్ ను పాటించడం, ఉప్పు, కొవ్వు కలిగిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం ద్వారా హై బీపీకి చెక్ పెట్టవచ్చు.
పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, బీన్స్, కూరగాయలు, గింజలు తీసుకోవడం ద్వారా కూడా హై బీపీ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. మిరియాలు, పుట్టగొడుగులు, బచ్చలికూర, ఆలివ్ నూనెతో వండిన ఆమ్లెట్ తినడం ద్వారా హై బీపీ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. ఆకుకూరలు, నిమ్మకాయతో చేసిన సలాడ్స్ తినడం ద్వారా హై బీపీ సమస్య సులభంగా దూరమవుతుంది.
Also Read: సంతోషకరమైన జీవితం గడపాలా.. అయితే ఈ వాస్తు టిప్స్ పాటించాల్సిందే..?
ఆహరంలో ఆలివ్ ఆయిల్, అవకాడోస్, గింజలు, విత్తనాలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. గింజలను చిరుతిండిగా తినడంతో పాటు ఆలివ్ ఆయిల్ తో వంటలను తయారు చేసి హై బీపీ తగ్గించుకోవచ్చు. నువ్వులు, నిమ్మరసంతో బ్రేక్ ఫాస్ట్ కోసం ఆవకాడో టేస్ట్ ను చేసుకోవడం ద్వారా కూడా హై బీపీ సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. గుడ్లు, చికెన్, చేపలు భోజనంలో తప్పనిసరి చేసుకుంటే హైబీపీ సమస్య దూరమవుతుంది.
చేపలు, చికెన్ సూప్‌లు తీసుకోవడం ద్వారా కూడా హైబీపీ సమస్యను సులభంగా దూరం చేసుకోవచ్చు. ఆహారంలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా హై బీపీ సమస్యతో బాధ పడేవాళ్లు బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
Also Read: పూజలు, వ్రతాలు చేసేవారు ఉల్లిపాయ వెల్లుల్లి ఎందుకు తినకూడదో తెలుసా?