Arthritis: కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా.. సులభంగా తగ్గించే చిట్కాలివే!

Arthritis: వయస్సు పెరిగే కొద్దీ వేధించే ఆరోగ్య సమస్యలలో కీళ్ల నొప్పులు ఒకటనే సంగతి తెలిసిందే. కీళ్ల నొప్పుల వల్ల 40 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు బాధ పడుతుంటారు. ఆహారంలో కీలక మార్పులు చేసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. 4 పద్ధతులను పాటించడం ద్వారా కీళ్ల నొప్పులను సులభంగా దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువ బరువు ఉంటే కీళ్ల నొప్పుల సమస్య వేధించే అవకాశాలు […]

Written By: Navya, Updated On : February 16, 2022 2:58 pm
Follow us on

Arthritis: వయస్సు పెరిగే కొద్దీ వేధించే ఆరోగ్య సమస్యలలో కీళ్ల నొప్పులు ఒకటనే సంగతి తెలిసిందే. కీళ్ల నొప్పుల వల్ల 40 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు బాధ పడుతుంటారు. ఆహారంలో కీలక మార్పులు చేసుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. 4 పద్ధతులను పాటించడం ద్వారా కీళ్ల నొప్పులను సులభంగా దూరం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

Arthritis

ఎక్కువ బరువు ఉంటే కీళ్ల నొప్పుల సమస్య వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బరువు పెరగడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఎక్కువ బరువు ఉన్నవాళ్లకు మోకాళ్లు, అరికాళ్లు, తుంటిలో భారం పెరిగి కొంచెం దూరం నడిచినా నొప్పులు వస్తాయి. బరువు తగ్గించుకోవడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్య దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

Also Read: సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించాడా? ప్రవీణ్ ప్రకాష్ బదిలీతో వాళ్లు ఎందుకు పండుగ చేసుకుంటున్నారు?

ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా కూడా కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టవచ్చు. కఠినమైన వ్యాయామాలను చేయడం ద్వారా కీళ్ల నొప్పుల సమస్యలు సులభంగా దూరమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఏరోబిక్, స్విమ్మింగ్, రన్నింగ్ చేయడంతో పాటు రోజూ వ్యాయామం చేస్తే కీళ్లలో ఫ్లెక్సిబిలిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆహారంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. చేపలు తినడం ద్వారా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఆర్థరైటిస్ నొప్పికి చెక్ పెట్టడంలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉపయోగపడతాయి. హాట్ అండ్ కోల్డ్ థెరపీ సహాయంతో కీళ్ల నొప్పులను దూరం చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాదాలను పావుగంట సమయం నీటిలో ముంచి తుడిస్తే ఈ సమస్య దూరమవుతుంది.

Also Read: 24 గంటల్లోనే ఇద్దరిని లేపిన జగన్..డీజీపీ, సీఎంవో కార్యదర్శి బదిలీలకు అసలు కారణం అదే?