Sleep Tips: మనిషి ఆరోగ్యానికి ప్రతిరోజు సరైన నిద్ర తప్పనిసరి. పెద్దవారు ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే చాలామంది ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్ కారణంగా అనుకున్న సమయంలో నిదురపోవడం లేదు. కొందరు నిద్రపోవడానికి అవకాశం ఉన్న ఫోన్ లేదా ఇతర జ్ఞాపకాల వల్ల రాత్రిళ్ళు మెలకువతో ఉంటున్నారు. అయితే ఒకవేళ సరైన సమయానికి నిద్రించిన సరైన దిశలోనే పడుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. లేకుంటే కొత్త రోగాలను కొనితెచ్చుకున్న వారవుతారు. కొంతమంది అన్ కంపోటబుల్ లో నిద్రిస్తారు. ఇష్టం వచ్చిన రీతిలో నిద్రించడం వల్ల భవిష్యత్తులో ఇవి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తాయి. అందువల్ల ముఖ్యమైన పొజిషన్లో మాత్రమే పడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఇంతకీ ఎలాంటి పొజిషన్లో పడుకోవాలి?
చాలామంది వన్ సైడ్ పడుకోవడం ఇష్టం ఉండదు. అయితే కొందరు వన్ సైడ్ పడకుండా సరైన దిశలో నిద్రించారు. లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి నిద్రించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం ఎడమవైపు తిరిగి పడుకున్న వ్యక్తుల జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. వీరికి భవిష్యత్తులో ఎలాంటి అల్సర్ లేదా వెయిట్ సమస్య ఉండకుండా ఉంటుందని జపాన్లోని టోక్యో మెడికల్ అండ్ డెంటల్ యూనివర్సిటీకి చెందిన వైద్యులు తెలిపారు. అలాగే ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల గురక సమస్య నుంచి తప్పించుకోవచ్చు. కొంతమందికి చిన్న వయసులోనే శ్వాస సమస్యలతో గురక ఏర్పడుతుంది. ఇలాంటివారు కుడివైపు తిరవ పడుకోవడం వల్ల గురకరాకుండా ఉంటుంది. అయితే ఎక్కువ సేపు కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కువసేపు ఎడమ ఎడమవైపు తిరిగి పడుకొని ఒక్కోసారి మాత్రమే కుడివైపు తిరిగి నిద్రించే ప్రయత్నం చేయాలి.
పూర్తిగా వెళ్లకిలా పడుకొని నిద్రించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇలా నిద్రించడం వల్ల అన్ని అవయవాలు నెలకు టచ్ అవుతాయి. దీంతో ఇవి ఎలాంటి సమస్య లేకుండా ఉంటాయి. అయితే తలకింద దిండును కాకుండా ఏదైనా చిన్న బెడ్ షీట్ లాంటిది మాత్రమే ఏర్పాటు చేసుకొని నిద్రించాలి. తలకింద దిండును ఉంచడం వల్ల మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది. కానీ శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నవారు మాత్రం దిండు పై తలను ఆనించి నిద్రించాలి.
కొంతమంది యువత కడుపును నేలకు ఆనిచ్చి ఇచ్చి నిద్రిస్తూ ఉంటారు. ఇలా నిద్రించడం వల్ల చాలా అనర్ధాలు వస్తుంటాయి. ఇలా పరుపుపై నిద్రించడం వల్ల మెడ నొప్పితో పాటు బ్యాక్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది వయసు పైబడిన తర్వాత తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల అన్ నాచురల్ గా నిద్రించడం మానుకోవాలి. లేకుంటే భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. ఎలా నిద్రించినా ప్రతిరోజు ఎనిమిది గంటలు స్లీపింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.