Spicy Food: రుచికరమైన ఆహారాన్ని సేవించడం చాలా మందికి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. టేస్టీ ఫుడ్ అంటే మొదట గుర్తుకు వచ్చేది మసాలా బాగా దట్టించిన బిర్యాని లేదా స్పైసి ఫుడ్. నేటి కాలంలో ఎక్కువగా టేస్ట్ ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. ఇలా ప్రాసెస్ చేసిన ఆహారం రుచిగా ఉండడంతో దీనిని తీసుకోవడానికి లైక్ చేస్తున్నాను. అయితే ఇవి రుచిగా రావడానికి వివిధ పదార్థాలను కలుపుతూ ఉంటారు. అలాగే కొందరు స్పైసి ఫుడ్ కావాలని కోరుకునే వారికి కాస్త మసాలాలను ఎక్కువగా వేస్తారు. మసాలాలు తినడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమే. కొన్ని మసాలాల వల్ల శరీరంలో ఎనర్జీని పెంచుతాయి. కానీ వీటిని అతిగా తినడం వల్ల అనేక రోగాలు వస్తాయని కొందరు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు మసాలాలు ఎక్కువగా తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం…
పేగుల్లో సమస్యలు:
మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే పై పొర డ్యామేజ్ అవుతుంది. దీంతో కొన్నిసార్లు కడుపు మంటగా అనిపిస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో డైజేషన్ సమస్యలు వచ్చి ఏ చిన్న ఆహారం తిన్న కడుపు నొప్పిగా వస్తుంది. అలాగే మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట అనిపిస్తుంది. ఇది ఏ రకమైన మంట తెలియక ఆందోళన చెందే అవకాశం ఉంది.
జీర్ణ సమస్య:
ప్రస్తుతం చాలామంది శారీరకంగా పనిచేయడం లేదు. దీంతో డైజేషన్ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ఇలాంటివారు మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారికి కడుపు ఉబ్బరంగా ఉండి సరైన ఆహారం తీసుకోలేక పోతారు. అలాగే తీన్ పూలతో ఇబ్బంది పడతారు. ఇక ఎలాంటి ఆహారం తీసుకున్న తొందరగా జీర్ణం కాక అవస్థలు ఎదుర్కొంటారు.
వాంతులు, విరేచనాలు:
మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో డయేరియా సమస్య కూడా అధికంగానే ఉంటుంది. ఒక్కోసారి ఇవి శరీరంపై తీవ్ర ప్రభావం చూపి వాంతులు విరేచనాలకు దారితీస్తాయి. వేసవికాలంలో అయితే మసాలాపొడి తీసుకున్న వారికి ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది.
చర్మంపై దద్దుర్లు:
చర్మంపై దద్దుర్లు రావడంతో చాలామంది ఇతర అనారోగ్యం అని ఆందోళన చెందుతారు. కానీ వీరు మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే కారణం దానినే భావించవచ్చు. మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకున్న వారిలో మొటిమలు, మచ్చలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారు మసాలా ఫుడ్ కు దూరంగా ఉండడం మంచిది.
నోటి దుర్వాసన:
మసాలా లో భాగమైన వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన ఎక్కువసేపు ఉంటుంది. దీంతో ఎక్కువసేపు ఇతరులతో మాట్లాడలేక పోతారు. అంతేకాకుండా ఇది ఉష్ణోగ్రతను పెంచి ఇబ్బందులకు గురిచేస్తుంది. వెల్లుల్లి తక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి.
అధికంగా ఉష్ణోగ్రత:
మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకునే వారిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. దీంతో వీరి కి ఎక్కువగా చెమట వస్తుంది. ఫలితంగా డిహైడ్రేషన్కు గురై అవస్థలు పడతారు. ముఖ్యంగా వేసవికాలంలో ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. అందువల్ల మసాలా ఫుడ్ కు దాదాపు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి.