https://oktelugu.com/

First Night : ఫస్ట్ నైట్ పాలగ్లాసుతో వధువు పడక గదిలోకి ఎందుకు వెళ్తుందో తెలుసా?

First Night : జీవితంలో తొలి రాత్రి కోసం అందరు వేచి చూస్తారు. ఎన్నో ఆశలు మరెన్నో ఊసులు కలబోసిన మొదటి రాత్రి కోసం ఎంతో ఆతృతగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసే క్షణాల కోసం అందరు ఎదురుచూడటం మామూలే. మన దేశంలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడుకోవడం నిషేధం విధించినా సురక్షిత శృంగారానికి పెద్దపీట వేశారు. అందుకే వాత్సాయనుడు కామసూత్ర రాశాడు. అందులో ఎన్నో విషయాలు మనకు వివరించాడు. శృంగారం అంటే బంగారంతో సమానంగా చూసే […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 20, 2023 / 01:59 PM IST
    Follow us on

    First Night : జీవితంలో తొలి రాత్రి కోసం అందరు వేచి చూస్తారు. ఎన్నో ఆశలు మరెన్నో ఊసులు కలబోసిన మొదటి రాత్రి కోసం ఎంతో ఆతృతగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసే క్షణాల కోసం అందరు ఎదురుచూడటం మామూలే. మన దేశంలో శృంగారం గురించి బహిరంగంగా మాట్లాడుకోవడం నిషేధం విధించినా సురక్షిత శృంగారానికి పెద్దపీట వేశారు. అందుకే వాత్సాయనుడు కామసూత్ర రాశాడు. అందులో ఎన్నో విషయాలు మనకు వివరించాడు. శృంగారం అంటే బంగారంతో సమానంగా చూసే వారు కూడా ఉండటం గమనార్హం. ఆడ మగ కలయికలో ఏ మహత్యం ఉందో కాని శృంగారమంటే చాలా మంది చచ్చిపోవడానికి కూడా సిద్ధమే అంటే నమ్మండి.

    తొలిరేయి

    ఈ నేపథ్యంలో శృంగారంలో మొదటి రేయి ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ రోజే వారి ప్రతాపం బయట పడుతుందని నమ్ముతారు. భాగస్వామిని సంతోష పెట్టే క్రమంలో ఫస్ట్ నైట్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు. తొలిరేయి నాడు వధువు పాల గ్లాస్ తో శోభనం గదిలోకి వెళ్లడం పూర్వ కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఇందులో ఉన్న మర్మం ఏమిటో ఎవరికి తెలియదు. కానీ తొలిరేయి అనుభవం కోసం అందరు తహతహలాడతారు. అందులో దాగి ఉన్న రహస్యాలు మాత్రం తెలుసుకోరు.

    పాలల్లో శక్తి

    పాలు ఇద్దరి శరీరాలను స్టిమ్యులేట్ చేస్తాయి. సత్వర శక్తిని ఇస్తాయి. మొదటి రాత్రి సంతోషంగా సాగేందుకు పరోక్షంగా కారణమవుతాయి. అందుకే పాలు తీసుకుని వధువు మొదటి రాత్రి గదిలోకి వెళ్తుంది. పెళ్లంటేనే వంటల సంబరం. ఇందులో కూరగాయలు, మాంసాహారాలు అన్ని ఇమిడి ఉంటాయి. దీంతో వారికి అజీర్తి చేయవచ్చు. పాలు తాగితే ఎసిడిటి లేకుండా చేస్తాయి. అందుకే నూతన దంపతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకే పాలు తాగుతారు. ఇంకా ఆడ,మగ కలిసినప్పుడు అధిక వేడి పుడుతుంది. దాన్ని నియంత్రణలో ఉంచేందుకు పాలు సాయపడతాయి. దీంతో దంపతులు పాలు తాగాలని నిబంధన పెట్టారు.

    రక్త ప్రసరణకు..

    పాలు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దంపతుల్లో నూతనోత్సాహం పెరుగుతుంది. ఇంకా ఉబ్బసాన్ని తగ్గించడంలో ఇవి సాయపడతాయి. మన పూర్వీకులకు పశుసంపద పుష్కలంగా ఉండటంతో వారు పాల గ్లాసుతో పెళ్లికూతురు గదిలోకి వెళ్లాలనే ఆచారం విధించారని చెబుతారు. పాల గ్లాసుతో గదిలోకి వెళ్లిన వధువు పండంటి బిడ్డతో తిరిగి రావాలని భావిస్తారు. అందుకే పాల గ్లాస్ అమ్మాయికి ఇవ్వడం ఆచారంగా వస్తోంది.