Massage: పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కొన్ని నెలల పాటు కచ్చితంగా మసాజ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు ఎన్నో లాభాలు కలుగుతాయి. కానీ మసాజ్ చేసేటప్పుడు వెచ్చని, నిశ్శబ్ధ ప్రదేశంలో మసాజ్ చేయడం మంచిది. అదే విధంగా మసాజ్ చేసేటప్పుడు వారి మెడలో ఉన్న దండలు, ఆభరణాలు ఏవైనా కూడా తీసివేయాలి. దీని వల్ల వారికి ఎలాంటి గీతలు పడవు. మరి మసాజ్ చేయడం వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం బెటర్? మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం.
పిల్లలకి మసాజ్ చేసేటప్పుడు నెమ్మదిగా చేయడం మంచిది. కానీ వారిని గట్టిగా పట్టుకుని మసాజ్ చేయాలి. కొందరి పిల్లలకు చక్కలిగింతలు అవుతుంటాయి. కాబట్టి అలా కాకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు మసాజ్ నచ్చుతుంది. అదే విధంగా మసాజ్ చేసేటప్పుడు వారితో మాట్లాడడం, పిలవడం వంటివి చేస్తుండాలి అంటారు నిపుణులు.
పిల్లల శరీరంలోని ప్రతి భాగాన్ని సున్నితంగా మసాజ్ చేస్తుండాలి. శిశువుని తిప్పి తల, మెడ, భుజాలు, తొడలు, కాళ్ళని వరసగా మసాజ్ చేయాలి. దీని వల్ల వారి ప్రతి భాగం యాక్టివ్ అవుతుంటుంది. అయితే ఇలా పిల్లలకి రోజు మసాజ్ చేయడం వల్ల వారి బాడీ కూడా బాగా ఎదుగుతుంది. అంతేకాదు పిల్లలకు ఒత్తిడి తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. శిశువు ఆరోగ్యంగా ఉండటానికి శ్వాస తీసుకోవడానికి, మంచి జీర్ణక్రియకి హెల్ప్ అవుతుంది మసాజ్.
మసాజ్ చేయడం వల్ల పిల్లలు చక్కగా నిద్రపోతారు. కాబట్టి, కచ్చితంగా మసాజ్ చేయాలి. ఇదెలా ఉంటే పిల్లలకు రెగ్యులర్‌గా మసాజ్ చేస్తే ఏడుపు తగ్గడం, గ్యాస్, కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు శ్వాసకోశ, నాడీ, కండరాల, జీర్ణ, ఎండోక్రైన్ వ్యవస్థలు బలపడతాయి. మరి తెలుసుకున్నారు కదా మసాజ్ వల్ల ప్రయోజనాలు. ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలకు కూడా మీరు చక్కగా మసాజ్ చేస్తూ ఉండండి.