సాధారణంగా శ్రావణ మాసంలో మాంసం తినడానికి చాలామంది ఇష్టపడరు. శ్రావణ మాసాన్ని పవిత్రమాసంగా ఎంతోమంది భావిస్తారు. ఈ మాసంలో వ్రతం జరిపించుకోవడంతో పాటు వరలక్ష్మీ అమ్మవారిని ఎక్కువమంది పూజిస్తారు. అయితే శ్రావణ మాసంలో పాలు, పెరుగు తినడానికి కూడా కొంతమంది ఇష్టపడరు. పాలు, పెరుగులో ఎన్నో పోషకాలు ఉంటాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇతర కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. సీజనల్ వ్యాధుల వల్ల మొక్కలపై ఎన్నో రకాల బ్యాక్టీరియాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి మొక్కలను ఆహారంగా తీసుకున్న గేదెలు, ఆవులు వర్షాకాలంలో జబ్బు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలలో, పెరుగులో హానికరమైన కీటకాలు వచ్చే అవకాశం ఉండటం వల్ల ఈ సీజన్ లో పాలు, పెరుగుకు వీలైనంత దూరంగా ఉండాలి.
ఇతర కాలాలతో పోలిస్తే వర్షాకాలంలో జీర్ణ వ్యవస్థ బలహీనపడే అవకాశం అయితే ఉంటుంది. పాలు, పెరుగు తీసుకుంటే జీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఎసిడిటి, ఇతర కడుపు సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ఈ నెలలో పాలు, పెరుగులకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. వర్షాకాలంలో పాలు, పెరుగు ఎక్కువగా తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
వర్షాకాలంలో పాలు, పెరుగు వల్ల వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, తిమ్మిరి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అందువల్ల ఈ నెలలో పాలు, పెరుగులకు వీలైనంత దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.