Sleep: ఎటు వైపు కాళ్లు పెట్టుకుని నిద్రించాలో తెలుసా?

Sleep: ప్రతి మనిషికి సరైన తిండి, నిద్ర రెండు అవసరమే. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచిగా నిద్ర పోవాలంటే సరైన దిక్కు చూసుకుని పడుకోవాలి. లేకపోతే సరైన నిద్ర పట్టదు. నిద్ర సరిగా పట్టకపోతే అనారోగ్యాలు దరిచేరతాయి. నిద్రపోయేటప్పుడు సరైన దిశలు చూసుకోవాలి. లేదంటే సరిగా నిద్ర రాదు. ఫలితంగా ఇబ్బందులు ఏర్పడతాయి. నిద్రతో మనకు చాలా లాభాలున్నాయి. మన ఆరోగ్యం నిద్రతోనే ముడిపడి ఉంటుంది. మన అవయవాలు సరిగా పనిచేయాలంటే నిద్ర తప్పనిసరి. […]

Written By: Srinivas, Updated On : March 12, 2023 5:15 pm
Follow us on

Sleep: ప్రతి మనిషికి సరైన తిండి, నిద్ర రెండు అవసరమే. ఆరోగ్యం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచిగా నిద్ర పోవాలంటే సరైన దిక్కు చూసుకుని పడుకోవాలి. లేకపోతే సరైన నిద్ర పట్టదు. నిద్ర సరిగా పట్టకపోతే అనారోగ్యాలు దరిచేరతాయి. నిద్రపోయేటప్పుడు సరైన దిశలు చూసుకోవాలి. లేదంటే సరిగా నిద్ర రాదు. ఫలితంగా ఇబ్బందులు ఏర్పడతాయి. నిద్రతో మనకు చాలా లాభాలున్నాయి. మన ఆరోగ్యం నిద్రతోనే ముడిపడి ఉంటుంది. మన అవయవాలు సరిగా పనిచేయాలంటే నిద్ర తప్పనిసరి.

ఎటు వైపు కాళ్లు..

ఎటు వైపు కాళ్లు పెట్టి నిద్రించాలి. ఏ దిక్కు కాళ్లు చాపుకోవాలనే దానిపై వాస్తు నిపుణులు సూచనలు చేస్తున్నారు. పడుకునే సమయంలో కాళ్లు ఎటు పెట్టుకోవాలి. తలుపులు ఉన్న వైపు కాళ్లు చాపకూడదు. ఇలా చేస్తే సరిగా నిద్ర పట్టదు. పైగా దెయ్యాలు తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుందట. తలుపులు ఉన్న వైపు కాళ్లు పెట్డడం వల్ల ఒంట్లోకి వ్యతిరేక శక్తి ప్రసారం అవుతుందట. దీని వల్ల మనకు అశాంతి, అసంతృప్తి, ఒత్తడి, ఆందోళన కలుగుతాయి. అందుకే మనం తలుపులు ఉన్న వైపు కాళ్లు పెట్టకూడదు.

తలుపుల..

ఇంట్లో నుంచి మృతదేహాలను బయటకు తీసుకొచ్చేటప్పుడు కాళ్లను బయటకు తీసుకొస్తారు. ఇలా మనం పడుకున్నప్పుడు తలుపుల వైపు కాళ్లు పెడితే అలా ఉంటుందని చెబుతుంటారు. అందుకే తలుపుల వైపు కాళ్లు పెట్టకూడదు. ఇతర ఏ దిక్కుకైనా కాళ్లు పెట్టి నిద్రించొచ్చు. కానీ తలుపులు ఉన్న వైపు కాళ్లు పెట్టి పడుకోకూడదు. దీంతో అశుభాలు కలుగుతాయని నమ్ముతారు. పడుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే మనకే నష్టం కలుగుతుంది. ఇలా చేయడం వల్ల మనకు ఎంతో కీడు జరుగుతుంది.

ఉత్తరం వైపు..

మనం నిద్రించేటప్పుడు అయితే దక్షిణం తల పెట్టుకుని ఉత్తరం వైపు కాళ్లు పెట్టుకుని పడుకోవాలి. లేకపోతే తూర్పు వైపు కాళ్లు పెట్టుకుని పడమర వైపు తల పెట్టి పడుకోవాలి. ఈ రెండు దిక్కులు పడుకునే దిశల్లో సరైనవి. అది కూడా తలుపులు లేకపోతే అలా చేయడం మంచిది. ఎటు వైపు తలుపు ఉంటే అటు వైపు కాకుండా మరోవైపు కాళ్లు పెట్టుకుని నిద్రించాలి. మనకు జీవితంలో ఎదురు దెబ్బలు తగలకుండా ఉండాలంటే వాస్తు నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకోకపోతే మనకు ఇబ్బందులు తప్పవని గుర్తించాలి.

Tags