Second heart in human body: ప్రతి శరీరానికి గుండె ప్రధాన అవయవం అని అందరికీ తెలిసిన విషయమే. గుండె కొట్టుకోవడం ఒక సెకండ్ ఆగినా కూడా ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అయితే ప్రతి మనిషికి గుండె ఉంటుందని అందరికీ తెలుసు. కానీ శరీరంలో మరో గుండె కూడా ఉంటుందని కొందరు వైద్యులు తెలుపుతున్నారు. మరి ఈ రెండో గుండె ఏం చేస్తుంది? ఇది ఎక్కడ ఉంటుంది?
మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే రక్తం పంపిణీ చేయడానికి గుండె ప్రధాన అవయంగా పనిచేస్తుంది. ప్రతి అవయవానికి గుండె ద్వారానే రక్తం వెళ్తుంది. గుండె చెస్ట్ లో ఎడమవైపు కొలువై ఉంటుంది. కానీ శరీరంలో మరో గుండె కూడా ఉంటుందని అంటున్నారు. అంటే చెస్ట్ లో ఉండే గుండె మాదిరిగా కాకుండా కాళ్ళ కింద ఉన్న మజిల్స్ ను రెండో గుండె గా పేర్కొంటారు. ఈ మజిల్స్ కూడా రక్తం పంపిణీ చేస్తాయన్న విషయం కొంతమందికే తెలుసు. కాళ్ల మజిల్స్ లో ఉండే రక్తం మెల్లిమెల్లిగా గుండెకు పంపుతుంది. ఇలా పంపడం ద్వారానే శరీరం ఆరోగ్యంగా ఉండగలుగుతుంది.. అయితే కాల మజిల్స్ లో ఉండే రక్తం గుండెకు వెళ్లాలంటే ఇవి ఎప్పుడు యాక్టివ్ గా ఉండాలి. అలా ఉండాలంటే నిత్యం నడుస్తూ ఉండాలి.
ప్రస్తుత కాలంలో చాలామంది డెస్క్ వర్క్ ఎక్కువగా చేస్తున్నారు. దీంతో చాలాసేపు ఒకే చోట కూర్చుంటున్నారు. ఇలా కూర్చోవడం వల్ల రక్తం గడ్డకట్టుపోతుంది. కాళ్ల మజిల్స్ లో ఉండే రక్తం గుండెకు సరఫరా కాకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్లలో ఉండే రక్తం సరఫరా కాకపోవడంతో మోకాళ్ల నొప్పులు రావడంతో పాటు తిమ్మిర్లు, కండరాల నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవి అలాగే ఎప్పటికీ ఉంటే భవిష్యత్తులో కాళ్లు నడవడానికి కూడా సహకరించి అవకాశం ఉండదు. అందువల్ల ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేస్తూ ఉండాలి.
అంతేకాకుండా కొందరు వ్యాయామం చేసినా.. కుర్చీలో ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వల్ల బ్లడ్ సర్కులేషన్ కాకుండా ఉంటుంది. అయితే ఇలాంటివారు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి లేచి నిలబడాలి. లేదా కనీసం అరగంటకు ఒకసారైనా బయటకు వెళ్లి రావాలి. ఒకవేళ ఇలా ప్రతిసారి నిల్చడం సాధ్యం కానీ సమయంలో.. కాళ్ళను అటు ఇటు కదిలిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కాళ్లు కదిలేలా జరుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కండరాల్లో ఉండే రక్తం తిరిగి గుండెకు పంపిణీ ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
శరీరానికి పై భాగంలో ఉండే గుండె ఎంత ముఖ్యమో.. మోకాళ్ళ కింద ఉండే కండరాల్లో జరిగే రక్త పంపిణీ కూడా అంతే ముఖ్యమని అంటున్నారు. అందుకే దీనిని రెండో గుండె గా పిలుస్తారు. పై భాగంలో ఉండే గుండెను ఎలా కాపాడుకోవాలో.. కింది భాగంలో ఉండే కాళ్ళ మజిల్స్ ను కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. లేకపోతే చిన్న వయసులోనే అనారోగ్యాల పాలు కావాల్సి వస్తుంది.