Heart Attack : గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Heart Attack : ప్రస్తుత కాలంలో గుండెజబ్బులు కలవరపెడుతున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు రావడంతో ప్రాణాలే గాల్లో కలుస్తున్నాయి. దీనికి కారణాలు ఉన్నాయి. మన ఆహార అలవాట్లే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చిన్ వయసులోనే గుండెజబ్బులు రావడానికి కారణమయ్యే పరిస్థితుల గురించి ఆలోచిస్తే దీనికి ప్రధాన శత్రువు ఉప్పు. మనం కూరల్లో విచ్చలవిడిగా వాడుతున్నాం. దీని వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగానే గుండె పోట్ల సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. […]

Written By: Srinivas, Updated On : April 1, 2023 10:09 am
Follow us on

Heart Attack : ప్రస్తుత కాలంలో గుండెజబ్బులు కలవరపెడుతున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు రావడంతో ప్రాణాలే గాల్లో కలుస్తున్నాయి. దీనికి కారణాలు ఉన్నాయి. మన ఆహార అలవాట్లే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. చిన్ వయసులోనే గుండెజబ్బులు రావడానికి కారణమయ్యే పరిస్థితుల గురించి ఆలోచిస్తే దీనికి ప్రధాన శత్రువు ఉప్పు. మనం కూరల్లో విచ్చలవిడిగా వాడుతున్నాం. దీని వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగానే గుండె పోట్ల సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి.

గుండెపోటు ఎందుకు వస్తుంది

గుండెపోటు ఎందుకు వస్తుంది. గుండె నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. ఈ మార్గంలో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే సరఫరాకు ఆటంకం కలుగుతుంది. దీంతో గుండెపోటు వస్తుంది. కానీ మనలో చాలా మందికి హార్ట్ ఎటాక్ వచ్చే వరకు తెలియదు. ఉన్నట్లుండి కుప్పకూలిపోవడమే. తక్షణమే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తే బతికే అవకాశాలుంటాయి. లేదంటే అంతేసంగతి. కొన్ని లక్షణాలు మాత్రం మనకు కనిపిస్తాయి. గుండె కొట్టుకునే శబ్ధాల్లో తేడాలు రావడం, మెడ నుంచి వెన్ను వరకునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.

సరైన చర్యలు లేక

గుండెపోటు రాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారాలు తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, మానసిక ఒత్తిడి, మారిన జీవన శైలి ఇవన్నీ మనకు హృద్రోగ సమస్యలు రావడానికి కారణాలవుతాయి. ప్రస్తుత కాలంలో అందరు జీవనశైలిని మార్చుకుంటున్నారు. నాగరికత పేరుతో పాశ్చాత్య ఫుడ్ అలవాట్లకు బానిసలవుతున్నారు. ఫిజాలు, బర్గర్లు తింటున్నారు. అందులో ఉండే ఉప్పు, నూనె, మైదా, కారం వంటి పదార్థాలు గుండె జబ్బులు రావడానికి అవకాశాలు కల్పిస్తున్నాయి.

గుండె జబ్బులు రాకుండా..

గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. ఫైబర్ ఎక్కువా ఉండే ఆహారాలు తినాలి. పాలిష్ పట్టిన బియ్యం తినకూడదు. మైదా, ఉప్పుడు రవ్వ వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. నూనెలో వేయించిన పదార్థాల జోలికి వెళ్లడం మంచిది కాదు. ఇలా మనం జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు మనకు రాకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.