
Ajwain (Vamu) : మన వంటింట్లో దొరికే వాటితోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. చాలా వరకు జబ్బులు వంటింట్లో దొరికే వాటితోనే నయమవుతాయి. ఆయుర్వేదంలో వీటిని విరివిగా వాడతారు. పూర్వ కాలం నుంచే వీటిని వాడి తమ ఆరోగ్యాలను బాగు చేసుకోవడంతో అనాదిగా వాటి వినియోగం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మనం వాము గురించి తెలుసుకుందాం. ఇది కూడా వంటింట్లో ఉంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఇది చెక్ పెడుతుందని ఎంత మందికి తెలుసు. ఇందులో ఉండే సుగుణాలతో మనకు ఎంతో మేలు చేస్తుంది. ఇంగ్లిష్ మందులు వాడే బదులు వాము వాడితే పలు రోగాలు మటుమాయం కావడం సహజం.
ఘాటుగా ఉన్నా..
వాము తింటే కాస్త ఘాటుగా ఉన్నా దాని ప్రయోజనాలు అనేకం. వాములో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి,ఇ, కెలతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే వాముతో మనం మన అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. వాములో థైమిన్ రూపంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసి మన శరీరానికి ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

ఎంత తీసుకుంటే..
వామును తగిన మోతాదులోనే తీసుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి వాడాలి. అంతేకాని ఇష్టమొచ్చినట్లు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే దీని వినియోగంలో పరిమితులు ఉన్నాయి. ఏదైనా పరిమితి మించితే ప్రమాదమే అనే విషయం గుర్తుంచుకోవాలి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు వామును ఎక్కువగా తీసుకుంటారు. కానీ అధికంగా తీసుకోవడం వల్ల యాసిడ్ రిప్లక్స్, గ్యాస్ సమస్యలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే జాగ్రత్తగా వాడుకోవాలి.
ఏ జాగ్రత్తలు పాటించాలి?
వామును నేరుగా తీసుకుంటే నోటిలో మంట, పుండ్లు అయ్యే ప్రమాదం ఉంది. శరీరంలో ఎక్కువ వేడి ఉన్న వారు కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా ఎలర్జీలు ఉన్న వారు వాము తీసుకోవద్దు. తీసుకుంటే ఇతర సమస్యలు వచ్చే వీలుంటుంది. ఇలా వాము వినియోగంలో కొన్ని పరిమితులు ఉన్నందున వాటిని తెలుసుకుని ప్రవర్తించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు కాకుండా మంచి ఆయుర్వేద నిపుణులను సంప్రదించి వామును సరైన పద్ధతిలో వినియోగించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్ిన అవసరం ఎంతైనా ఉంది.