Vastu Shatra: వాస్తు శాస్త్రంలో మనకు ఎన్నో విషయాలు తెలియనివి ఉంటున్నాయి. దీంతో మనం ఇల్లు కట్టుకునే సందర్భంలో వాస్తు విషయాలు పాటిస్తున్నాం. దీంతో రాబోయే ఆపదలను తెలుసుకుని వాటిని దరిచేరకుండా చేయడానికి మొగ్గు చూపుతున్నాం. మన ఇంటికి ఏ దిశలో ఎలా ఉండాలో కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది. మన ఇంటికి నాలుగు దిక్కులు, నాలుగు దిశలు ఉన్న సంగతి తెలిసిందే. ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర దిక్కులు కాగా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం దిశలుగా ఉన్నాయి. దీంతో మన ఇంటికి ఉన్న దిక్కులు, దిశలు సరైన విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాం.
మనకు ఉత్తరం దిక్కు బాగా ఉపకరిస్తుంది. వాస్తు శాస్త్ర రీత్యా ఉత్తరం కుబేర స్థానం కావడంతో దీనిపై ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. వాస్తు అంటే వస్తువుల అమరిక అని తెలిసిందే కదా. దీనికి గాను మన ఇంట్లో ఎటు వైపు ఏ వస్తువులు ఉంచుకోవాలో కూడా వాస్తు వివరంగా చెబుతోంది. ఉత్తరం దిక్కు ప్రాధాన్యం గురించి వాస్తులో ప్రముఖంగా ప్రస్తావించారు. దీంతో మన ఇంటి ఎదుగుదలకు ఉత్తరం దిక్కు ప్రధానమైనదిగా చెబుతుంటారు. అందుకే ఉత్తరం వైపు ఏ వస్తువులు ఉండాలో కూడా తెలుసుకోవడం మంచిది.
Also Read: India vs Pakistan Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. గెలుపు ఎవరిదంటే
దీంతో వాస్తుకు మనం ఇస్తున్న విలువ ఎలాంటిదో అందరికి తెలిసిందే. వాస్తులో మనం ఎన్నో విధాలైన జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు ప్రయోజనం కలుగుతుందని తెలుసుకోవాలి. వాస్తులో ఎన్నో పద్ధతులు పాటిస్తే మనకు లాభాలు దక్కుతాయి. దిక్కులు, దిశలు సరిగా పాటించి ఫాలో అయితే మనకు వాస్తు దోషాలు లేకుండా పోతాయని తెలుస్తోంది. అందుకే వాస్తు శాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే మనకు ఏ నష్టాలు లేకుండా ఉంటాయి. ఉత్తరంలో ఏ వస్తువులు ఉంచాలో కూడా తెలుసుకోవాలి.
ఉత్తర దిక్కులో కుబేరుడు ఉండటంతో డబ్బును విలువైన వస్తువులను దాచుకోవడానికి సావకాశంగా ఎంచుకోవాలి. అగ్నికి సంబంధించిన వస్తువులు ఇలాంటి చోట పెట్టకపోవడమే మంచిది. బంగారం, డబ్బు, విలువైన ఆస్తి కాగితాలు వంటి వాటిని ఉత్తర దిక్కులో ఉంచితే ప్రయోజనం కలుగుతుంది. ఉత్తర దిక్కుకు ఉన్న విలువను గుర్తించి మసలు కుంటే మనకు ఎలాంటి ఇబ్బందులు రావు. అంతేకాని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే మన ఇంట్లో డబ్బు నిలవదు. దీంతో కష్టాలు మొదలవుతాయి. అందుకే వాస్తు నియమాలు కచ్చితంగా పాటించి తీరాలి.