https://oktelugu.com/

Heart Attack: ఆవు పాలు తాగితే.. మహిళల్లో గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందా?

మహిళలు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా పాలు తాగుతారు. అయితే మహిళలు ఆవు పాలు తాగడం వల్ల గుండె పోటు వస్తుందని కొందరు అపోహ పడుతున్నారు. మరి ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 14, 2024 / 04:47 AM IST

    milk

    Follow us on

    Heart Attack: ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలని చాలా మంది పాలు తాగుతారు. పాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల కండరాలు, ఎముకలు బలంగా తయారవుతాయి. పాలను చిన్నప్పటి నుంచి తాగుతుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు తప్పకుండా పాలను ఇస్తారు. ఇందులో కాల్షియం, ప్రొటీన్, విటమిన్ డి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. డైలీ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉండటంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉండటం, నిద్రలేమి సమస్యలు తొలగిపోవడం వంటివి కూడా జరుగుతాయి. రోజూ ఏదో ఒక సమయంలో పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా రావు. ఇందులో ఆరోగ్యమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలాంటి అనారోగ్య సమస్యలను కూడా దరిచేరనియ్యవు. అయితే మహిళలు ఏదో ఒక సందర్భంలో తప్పకుండా పాలు తాగుతారు. అయితే మహిళలు ఆవు పాలు తాగడం వల్ల గుండె పోటు వస్తుందని కొందరు అపోహ పడుతున్నారు. మరి ఇందులో నిజమెంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

     

    పురుషులతో పోలిస్తే మహిళలు ఆవు పాలతో చేసిన టీ లేదా కాఫీ తాగడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకి 400 మి.లీ ఆవు పాలు తాగే మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుదట. పాలలో ఉండే లాక్టోస్ శరీర కణాల్లో మంటలను పెంచుతుంది. ఈ లాక్టోస్ మహిళల శరీరంలో జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీనివల్ల కొన్నిసార్లు గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందట. మొత్తం 60 వేల మంది మహిళలు, 40 వేల మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. ఆవు పాలతో కాఫీ లేదా టీ తాగే మహిళల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ ముప్పు 5 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఐరోపా ప్రజలపై ఈ పరిశోధన చేశారు. ఇండియాలో ఆవు పాలు తాగే మహిళల్లో కూడా ఇదే వర్తిస్తుందా? లేదా? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

     

    పూర్వం రోజుల నుంచి ఆవు పాలను తాగుతున్నారు. పాలలో అధికంగా ఉండే కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా బరువును కూడా పెంచుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. పాలలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యం, దంతాల దృఢత్వానికి ఉపయోగపడుతుంది. అలాగే బోలు ఎముకల వ్యాధి రాకుండా విముక్తి కల్పిస్తుంది. డైలీ పాలు తాగడం వల్ల శరీరానికి విటమిన్ డి కూడా అందుతుంది. ప్యాకెట్ పాల కంటే ఆవు పాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే నిపుణులు చెబుతుంటారు. కానీ ఈ అధ్యయనంలో మాత్రం ఆవు పాలతో మహిళలకు గుండె పోటు వస్తుందని చెబుతున్నారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.