Avoid Rice: నెల రోజుల పాటు అన్నం తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

ఎక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకుంటే వాటిని జీర్ణం చేయడానికి ఎక్కువ చక్కెర అవసరం. అప్పుడు శరీరంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. శరీరంలో షుగర్ లెవెల్ పెరిగితే మధుమేహం సమస్య తీవ్రం అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది.

Written By: Swathi, Updated On : May 15, 2024 5:23 pm

Avoid Rice

Follow us on

Avoid Rice: ఈ మధ్య కాలంలో అతి బరువు సమస్య చాలా మందిని వేధిస్తుంది. దీని కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజలు. అయినా ఫలితం లేకపోవడంతో అన్నం తినడానికి కూడా భయపడుతున్నారు. ఉదయం ఏవైనా జ్యూస్ లు తాగి తర్వాత కాస్త ఫ్రూట్స్ ఆ తర్వాత రొట్టే వంటివి తింటూ వారి రోజును గడిపేస్తుంటారు. కొందరు ఏకంగా అన్నాన్ని కూడా తినకుండా ఉంటారు. బియ్యం వేగంగా కేలరీలను పెంచుతుంది.. జీవక్రియను నెమ్మదిస్తుంది కాబట్టి పొట్ట కొవ్వు, ఊబకాయాన్ని పెంచుతుంది. అందుకని అన్నాన్ని తినకుండా ఉంటారు.

ఎక్కువ కార్బోహైడ్రేట్లను తీసుకుంటే వాటిని జీర్ణం చేయడానికి ఎక్కువ చక్కెర అవసరం. అప్పుడు శరీరంలో చక్కెర స్థాయి కూడా పెరుగుతుంది. శరీరంలో షుగర్ లెవెల్ పెరిగితే మధుమేహం సమస్య తీవ్రం అయ్యే సమస్య ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు సమస్య పెరుగుతుంది. అలాగే థైరాయిడ్, పీసీఓడీ బాధితులకు కూడా రైస్ తినడం మంచిది కాదు అంటారు నిపుణులు. ఏదైనా వ్యాధితో బాధపడేవారు శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి అన్నం తక్కువగా తినాలని సూచిస్తున్నారు. దీని వలవ్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయట.

అన్నం తినడం వల్ల బద్ధకం పెరుగుతుందని.. తరచుగా నిద్ర వస్తుందని అంటారు. దీనివల్ల పనిపై ఆసక్తి కూడా ఉండదట. అయితే అన్నం తినడం మానేయడం వల్ల శరీరం మునుపటి కంటే చురుగ్గా మారుతుంది అంటున్నారు నిపుణులు. సోమరితనం తగ్గుతుందట. కూర్చున్న, నిలబడినా నిద్ర మత్తు ఉండదు కాబట్టి పని కూడా చురుగ్గా చేసుకోవచ్చట. ఇంతకు ముందెన్నడూ అనుభవించని చాలా మార్పులను మీరు గమనిస్తారట. శరీరం బరువు తగ్గినట్లు అనిపిస్తుంది.

బియ్యంలో లభించే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి శక్తినివ్వడానికి అవసరం అవుతాయి. ఇక ఈ అన్నాన్ని పక్కన పెడితే బలహీనపడటం కూడ ఖాయం అంటున్నారు. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. శరీరంలో పోషకాలు, ఖనిజాల లోపం కూడా వస్తుందట. శరీరంలోని కొవ్వును తగ్గించడమే లక్ష్యం కావాలి కానీ.. కండరాలను బలహీనపరచడం కరెక్ట్ కాదు. కాబట్టి రైస్ ఫుడ్ ను ఎప్పటికప్పుడు మితంగా తీసుకుంటూ, పూర్తిగా దూరంగా ఉండకూడదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

మధుమేహం అదుపులో ఉండాలంటే, బరువు తగ్గాలంటే నెల రోజుల పాటు అన్నం పూర్తిగా మానేయాలని నిర్బంధం లేదు కానీ ప్రతి రోజు కొంత మాత్రం తీసుకుంటే సరిపోతుందట. అంటే రైస్ ను మితంగా తీసుకోవాలి. ఒకవేళ మీరు బియ్యం తీసుకోవడం మానేస్తే మన రోజువారీ ఆహార జాబితాలో పోషకమైన ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.