Gongura uses: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు గోంగూర తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

Gongura uses:  మనలో చాలామంది గోంగూరను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. గోంగూర తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు గోంగూరలో ఉన్నాయి. ఆయుర్వేద వైద్యులు సైతం వారానికి ఒకసారైనా గోంగూరతో చేసిన పప్పు లేదా పచ్చడి తినాలని సూచనలు చేస్తున్నారు. గోంగూర గుండెకు మేలు చేయడంతో పాటు శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది. తరచూ గోంగూరను తీసుకునే వారికి ఎ, బి, సి విటమిన్లు […]

Written By: Kusuma Aggunna, Updated On : December 28, 2021 6:00 pm
Follow us on

Gongura uses:  మనలో చాలామంది గోంగూరను ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. గోంగూర తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు గోంగూరలో ఉన్నాయి. ఆయుర్వేద వైద్యులు సైతం వారానికి ఒకసారైనా గోంగూరతో చేసిన పప్పు లేదా పచ్చడి తినాలని సూచనలు చేస్తున్నారు. గోంగూర గుండెకు మేలు చేయడంతో పాటు శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది.

Gongura uses

తరచూ గోంగూరను తీసుకునే వారికి ఎ, బి, సి విటమిన్లు లభిస్తాయి. కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్లు గోంగూర తినడం ద్వారా ఆ సమస్యలను అధిగమించే అవకాశం అయితే ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు ఇన్సులిన్ స్థాయిలను పెంచడంలో గోంగూర ఉపయోగపడుతుంది. గోంగూర రక్తపోటును అదుపులో ఉంచడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

Also Read: మెంతి ఆకులతో ఆ వ్యాధులకు సులువుగా చెక్ పెట్టే ఛాన్స్.. ఎలా అంటే?

గోంగూరలో శరీరానికి అవసరమైన ఐరన్, పొటాషియంతో పాటు ఇతర ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. గోంగూరలో మినరల్స్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. గోంగూరలో ఉండే విటమిన్ల వల్ల దంత సమస్యలు దూరమవుతాయి. గోంగూరలో ఉండే క్యాల్షియం వల్ల ఎముకలు పటిష్టంగా ఉంటాయి. గోంగూర తినడం వల్ల కొన్ని రకాల భయంకరమైన క్యాన్సర్ లకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధ పడేవాళ్లు గోంగూర తినడం ద్వారా ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గోంగూర తినడం వల్ల రేచీకటి సమస్యకు చెక్ పెట్టవచ్చు. రేచీకటితో బాధ పడేవాళ్లు గోగుపూలతో రసం చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలెర్జీలతో బాధ పడేవాళ్లు గోంగూరకు దూరంగా ఉంటే మంచిది.

Also Read: చెవిలో గులిమి తొలగించుకోవాలనుకుంటున్నారా.. పాటించాల్సిన చిట్కాలివే!