https://oktelugu.com/

RRR: మల్టీస్టారర్​ కింగ్​ మేకర్స్ ఆప్పుడు బాలచందర్​.. ఇప్పుడు రాజమౌళి- జూ.ఎన్టీఆర్​

RRR: దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఎంతో ఆతృతగా ఎదురుచూసేలా చేస్తున్న మూవీ ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు, పాటలు నెట్టింట ట్రెండింగ్​ని సృష్టిస్తున్నాయి. మరోవైపు, సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో టీమ్​ మొత్తం ప్రమోషన్స్​లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవలే బాలీవుడ్​లో ప్రమోషన్స్​ను పూర్తి చేసుకున్న ఈ ఆర్​ఆర్​ఆర్ గ్యాంగ్​.. ఇప్పుడు చెన్నైలో అడుగుపెట్టింది. తాజాగా, చెన్నైలో నిర్వహించిన ప్రీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 28, 2021 / 10:09 AM IST
    Follow us on

    RRR: దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఎంతో ఆతృతగా ఎదురుచూసేలా చేస్తున్న మూవీ ఆర్​ఆర్​ఆర్​. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్​, రామ్​చరణ్ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు, పాటలు నెట్టింట ట్రెండింగ్​ని సృష్టిస్తున్నాయి. మరోవైపు, సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో టీమ్​ మొత్తం ప్రమోషన్స్​లో ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవలే బాలీవుడ్​లో ప్రమోషన్స్​ను పూర్తి చేసుకున్న ఈ ఆర్​ఆర్​ఆర్ గ్యాంగ్​.. ఇప్పుడు చెన్నైలో అడుగుపెట్టింది.

    RRR

    తాజాగా, చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో జూనియర్ ఎన్టీఆర్​ మాట్లాడుతూ.. ఈ వేడుకను ఇంత పెద్ద సక్సెస్​ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ శివకార్తికేయన్​ గురించి మాట్లాడుకోవాలి. ఆయన డెడికేషన్​కి, ప్రేమాభిమానాలకు నేను వెల కట్టలేను. సర్​ మీరెప్పుడూ ఇలాగే ఉండాలి. ఇక రాజమౌళి గురించి చెప్పాలంటే.. ఈ పాత్రకోసం నన్ను నమ్మి నాకు ఇచ్చారు. ఈ సినిమా కోసం రాజమౌళి పడిన కష్టం నేను చెప్పను.. మీరే థియేటర్​లో చూడండి.

    Also Read: Jr Ntr: ఎన్టీఆర్​-కొరటాల కాంబో సినిమాలో హీరోయిన్​గా సామ్​?

    బాహుబలికోసం ఎంత కష్టపడ్డారో అంతకు రెట్టింపు కష్టం ఈ సినిమాలో కనిపిస్తుంది. అప్పట్లో ఇద్దరు స్టార్ హీరోలను కలిపి సినిమా తీసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపే వారు బాలచందర్​.. ఇప్పుడు రాజమౌళి ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఇక చరణ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. తనతో నా స్నేహం వెలకట్టలేనిది. ఇక్కడికి వచ్చిన చెర్రీ అభిమానులందరికీ థ్యాంక్స్​. ఇక ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.. అని స్పీచ్ ముగించారు.

    Also Read: Samantha: బికినీలో హాట్​లుక్స్​తో కవ్విస్తోన్న సమంత.. గోవా టూర్​లో ఎంజాయ్​