Homeవార్త విశ్లేషణFruits : ఏ ఫ్రూట్‌ తింటే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?

Fruits : ఏ ఫ్రూట్‌ తింటే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?

Fruits :  మారుతున్న జీవన శైలి, ఉరుకులు పరుగుల జీవితం కారణంగా మనం తీసుకునే ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాం. దీంతో వ్యాధులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు సంప్రదాయ, సేంద్రియ ఆహారం తీసుకోవడం కారణంగా వందేళ్లు ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతం రసాయనాలతో పండుతున్న పంటలే ఆహారంగా తీసుకుంటున్నాం. ఇక నేచురల్‌ పండు దొరకడం లేదు. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్, అల్సర్స్, కిడ్నీ, లివర్‌ సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. అయితే కోవిడ్‌ తర్వాత చాలా మంది తమ జీవన శైలిని మార్చుకున్నారు. హెల్తీ ఆహారం తీసుకోవాలని చూస్తున్నారు. దీంతో సేంద్రియ పంటల సాగు పెరిగింది. పండ్లు కూడా నేచురల్‌గా పండిస్తున్నారు. మసాలాలు, రసాయనాలతో చేసి ఆహారం కన్నా.. పండ్లు, ఫలాలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ పండు తింటే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

పప్పాయ
శీతాకాలంలో దొరికే పండు పప్పాయ. ఇందులో పప్యెన్‌ అడే డైజెస్టివ్‌ ఎంజయమ్‌ ఉంటుంది. అది డైజేషన్‌ సిస్టమ్‌ను మెరుగు పరుస్తుంది. బోన్‌హెల్త్, హార్ట్‌ హెల్త్, స్కిన్‌ హెల్త్‌ను మెరుగు పరుస్తుంది.

వాటర్‌ మిలన్‌..
వేసవిలో ఎక్కువగా దొరిక పండు వాటర్‌ మిలన్‌. ఇందులో 80 శాతం నీరు ఉంటుంది. ఇవి తింటే శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. డీహైడ్రేషన్‌ సమస్య ఉండదు. స్కిన్‌ హెల్త్‌ను బెటర్‌ చేస్తుంది.

యాపిల్‌..
ఇక చాలా మంది యాపిల్‌ను ఆరోగ్య పండుగా భావిస్తారు. అందుకే వైద్యులు కూడా యాపిల్‌ తినాలని సూచిస్తారు. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. కొన్నిరకాల క్యాన్సర్ల నియంత్రణకు దోహదపడతాయి. కొలెస్ట్రాల్, బీపీ, ఇన్‌ప్లమేషన్‌ను తగ్గిస్తాయి.

జామ పండు..
ఇవి కూడా శీతాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ఇందులో ఉండే హై ఫైబర్‌ డైజేషన్‌ సిస్టమ్‌ను మెరుగు పరుస్తాయి. ఇందులో అధిక మోతాతులో ఉండే విటమిన్‌ సీ మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది.

దానిమ్మ…
దానిమ్మ కూడా సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో లబిస్తుంది. దీనిని పవర్‌ హౌస్‌ ఆఫ్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ అంటారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. మతిమరుపు రాకుండా చూస్తుంది.

చెర్రీస్‌..
చెర్సీస్‌ అరుదుగా లభిస్తాయి. ధర ఎక్కువగా ఉంటుంది. ఇందులో మెలటోలిన్‌ అనే హర్మోన్‌ ఉంటుంది. ఇది నిద్రకు దోహదపడుతుంది. దీంతో మంచి నిద్ర పడుతుంది.

ఖర్జూర…
ఇవి మన దేశంలో లభించవు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అన్ని కాలాల్లో లభిస్తాయి. ఇందులో హై ఫైబర్‌తోపాటు నేచురల్‌ షుగర్‌ ఉంటుంది. లో గ్లైజమిక్స్‌ ఇండెక్షన్‌ కారణంగా బీపీని రెగ్యులేట్‌ చేస్తుంది.

ఇలా పండ్లతో కలిగే ప్రయోజనాలు తెలుసుకుని తింటే.. మనలో ఉన్న సమస్యలు, అనారోగ్యాన్ని నేచురల్‌గా తగ్గించుకోవచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular