Flax seeds : అవిసె గింజలో కరిగే, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా లభిస్తాయి. ఇందులోని కరిగే ఫైబర్ హృదయనాళ పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. కరగని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మంచి పాత్ర పోషిస్తుంది. ఫ్లాక్ సీడ్స్‌లో ఫైటోకెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి క్యాన్సర్‌తో పోరాడుతుంటాయి. ఇందులోని లిగ్నాన్స్ శరీరంలోని రసాయనాల ద్వారా జీవక్రియ జరిగి శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. ఈ విత్తనాలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు రొమ్ము, ప్రోస్టేట్, పెద్దపేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఫ్లాక్‌సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. అవిసె గింజల్లో ఉండే అధిక పీచు పదార్థం ఎంత సేపు అయినా ఆకలి లేకుండా ఉండేలా చేస్తుంది. దీని ద్వారా అతిగా తినరు. సో శరీరంలో క్యాలరీల పరిమాణాన్ని పెంచకుండా ఉంచుకోవచ్చు. అవిసె గింజల్లో 95శాతం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మంచిది. అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. అవిసె గింజల్లోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అవిసె గింజల్లో ఒమేగా-3, విటమిన్ E ఉంటాయి. ఇవి జుట్టుకు మంచివి.
అవిసె గింజల నూనె కూడా..
అవిసె గింజల నూనెలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు దాగి ఉన్నాయి అంటున్నారు నిపుణులు. దీన్ని రోజూ వారీ డైట్ లో చేర్చుకోవాలి. మరి బెస్ట్ రూట్ ఏంటి? ఎలా చేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ నూనె వాడతారని, ఈ నూనె ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. కానీ ఈ ఒక్క నూనెను రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో బాలింతలకు ఈ నూనెను ఇస్తుంటారు. అన్ని పోషకాలున్న నూనె ఈ అవిసె నూనె. రోజూ పచ్చిగా ఈ నూనె ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, గుండె ఆరోగ్యం నుంచి డయాబెటిస్ వరకు తగ్గించుకోవాలనుకుంటే కచ్చితంగా మీ ఆహారంలో అవిసె గింజల నూనెను యాడ్ చేసుకోవడం మంచిది. ఇది శరీరానికి అవసరమైన ఖనిజాలను, పోషణను అందిస్తుంది.