ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ప్రకృతి ప్రసాదించిన ఫలాలను తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలకు సులభంగా చెక్ చెప్పడం సాధ్యమవుతుంది. సీజనల్ ఫ్రూట్ అయిన ఫైనాపిల్ ను తెలుగులో అనాస పండు అని పిలుస్తారు. పైనాపిల్ తినడానికి తియ్యని రుచిని కలిగి ఉంటుంది. సోడియం, పొటాషియం నిల్వలు పైనాపిల్ లో ఎక్కువగా ఉంటాయి.
పైనాపిల్ ను రోజూ తినడం ద్వారా ఒత్తిడి, ఆందోళన, ఇతర ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. పైనాపిల్ తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే తగ్గుతాయి. చర్మ సంబంధిత సమస్యలను సులువుగా దూరం చేయడంలో అనాస ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. బాగా పండిన పైనాపిల్ ను ప్రతిరోజూ తింటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
క్యాన్సర్ రోగులలో కలిగే దుష్ప్రభావాలను దూరం చేయడంలో అనాసలో ఉండే బ్రొమిలైన్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. జ్వరం, కామెర్లు సమస్యలతో బాధ పడేవాళ్లకు అనాస రసం దివ్యౌషధంగా పని చేస్తుందని చెప్పవచ్చు. స్కర్వే వ్యాధి రాకుండా రక్షించడంలో అనాస పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. అనాస పండు వల్ల ఆడవాళ్లలో నెలసరి సంబంధిత సమస్యలు దూరమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
శరీరంలో వికారంను తగ్గించడంలో అనాస పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియ ప్రక్రియకు సైతం అనాస పండు సహాయపడుతుంది. విపరీతమైన వాంతులతో బాధ పడేవాళ్లు అనాస పండు రసం తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. అనాసలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.