Fruits : ప్రస్తుతం చాలా మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇందులో హై బీపీ, లో బీపీ రెండు ఉంటాయి. దీంతో చిన్న వయసులోనే బీపీతో సతమతమవుతున్నారు. మందులు వాడుతూ కంట్రోల్ లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీపీతో చాలా సమస్యలు వస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. బీపీని నియంత్రణలో ఉంచే పండ్లు కూడా ఉన్నాయి. వీటితో మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. రక్తపోటును అదుపులో ఉంచుకునే ఆహారాలు కూడా ఉండటంతో వాటిని తీసుకుని మనకు బీపీ ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.
సిట్రస్ పండ్లలో..
సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మూత్రపిండాల్లో అదనంగా ఉండే నీటిని సోడియంను బయటకు పంపుతాయి. ఇంకా రక్తనాళాల గోడలను సడలించి రక్తపోటు నియంత్రణలో ఉండేలా సాయపడతాయి. ఇందులో ఉండే నారింజిన్ అనే బయో ఫ్లవనాయిడ్ వల్ల ఒత్తిడి తగ్గిస్తాయి. చెడు కొవ్వును లేకుండా చేస్తాయి. దీంతో మనకు గుండెపోటు రాకుండా చేయడంలో కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో కూడా తోడ్పడతాయి.
అవకాడోలో..
ఇందులో మెగ్నిషియం పెద్దమొత్తంలో ఉంటుంది. రక్తనాళాల గోడలను సవరించి రక్తప్రవాహంలో ఇబ్బందులు లేకుండా చేస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, మోనోశాచురేటెడ్ కొవ్వు గుండెను ఆరోగ్యంా ఉంచటంలో సాయపడుతుంది. ఇలా అవకాడోలో ఎన్నో రకాలైన ప్రొటీన్లు ఉండటంతో రోజు వారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం మంచిది. మన ఆరోగ్య పరిరక్షణలో ఇది ఎంతగానే తోడ్పడుతుంది.
ఆఫ్రికాట్ లో..
గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మనకు ఎంతో మేలు చేస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు దూరం చేయడంలో ఇది ఎంతగానో సాయపడుతుంది. ధమనుల పనితీరును బాగు చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఇది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇలా రక్తపోటు నియంత్రణలో మనకు పళ్లు మేలు చేస్తాయి. అందుకే వాటిని తరచుగా తీసుకుని బీపీని కంట్రోల్ లో ఉంచుకునేలా మనం చర్యలు తీసుకుంటే మనకే మంచిది. మన ఆరోగ్యమే మెరుగుపడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.