Lust And Love: ప్రేమ ఓ అందమైన అనుభూతి. దాని గురించి ఎందరో కవులు రాశారు. ప్రేమ ఎంత మధురం అన్నారో సినీకవి. అందులో ఉన్నది మధురానుభూతి అని తెలిసిందే .ప్రేమ గురించి ఆలోచించని మనసుండదు. ప్రేమ చిగురించని మనసు ఉండదని తెలుస్తోంది. ప్రేమ ఓ సుందరమైన స్వప్నం. ప్రేమలో ఉంటే ఇక ఏదో అయిపోతున్నట్లుగా ఉంటుంది. అందులో ఉండే మజానే వేరు. అందుకే ప్రేమ అందరిలోనూ కనిపిస్తుంది. అందరి మనసులను దోచేస్తుంది. ప్రేమ కోసం త్యాగాలు చేసిన వారు ఉన్నారు. ప్రాణాలు తీసేవారు కూడా ఉండటం తెలిసిందే. దీంతో ప్రేమ అనే భావన ఒకసారి మనసును తాకితే జీవితంలో దాని నీడలు మనల్ని వెంటాడతాయి.
ప్రేమలో స్వచ్ఛమైన కోణం ఉంటుంది. నిజాయితీగా ప్రేమించే వారు కూడా ఉంటారు. ప్రేమలో నిజాయితీ ఉంటేనే అది చిరకాలం నిలుస్తుంది. ప్రేమించిన వ్యక్తి కోసం అన్ని సుఖాలు వదులుకుని వారి బాగోగులు చూడటమే ధ్యేయంగా పెట్టుకుని జీవితాంతం అండగా నిలుస్తారు. దీంతో వారికి ఏ కష్టమొచ్చినా అండగా నిలిచి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడమే. ప్రేమించిన వ్యక్తికి ఏ బాధ కలిగినా చలించిపోయే మనస్తత్వం ఉండటంతో వారి కోసం నిరంతరం ఆలోచనలు రావడం సహజమే.
Also Read: Sarkaru Vaari Paata 18 days Collections: వావ్.. 18వ రోజు కూడా మహేష్ కుమ్మేశాడు !
ఆకర్షణ కూడా ప్రేమలో ఒక భాగమే. దీంతో మనిషి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇందులో కామం ప్రధాన భూమిక పోషిస్తుంది. ప్రేమించిన వ్యక్తిని పొందాలనే ఉద్దేశం కలగడమే కామం. లైంగిక ఉద్దీపనతోనే తనలో ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల ప్రభావంతో మనుషుల్లో లైంగిక వాంఛలు కలగడం తెలిసిందే. దీంతో తాము ప్రేమించిన వ్యక్తితో శృంగారంలో పాల్గొనాలనే తపన ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రేమ బంధం గురించి అనేక వాదనలు ప్రచారంలో ఉండటం కామనే.
కామంతో ఉన్న వారికి ఏదైనా అదే దృష్టితో ఉంటారు. అందుకే కామా తురానాం నభయం నలజ్జ అన్నారు. కామంతో ఉన్న వారికి ఏదైనా కామంతోనే చూస్తారని చెబుతారు. కామంతో ఉన్న వారికి లైంగిక వాంఛలు ఎక్కువే ప్రేమించిన వారిని తమ సుఖం తీర్చుకోవడాలని భావించి వారితోనే ఉండాలని ఉవ్విళ్లూరుతారు. తమ కోరికలు తీర్చుకునే క్రమంలో పదే పదే అదే కావాలని కోరుతుంటారు. ప్రేమలో నిజాయితీ ఉంటేనే మనుగడ సాధ్యం. స్వార్థంతో ఆలోచిస్తే అంతే సంగతి. భవిష్యత్ ఉండదు. విశ్వాసం కూడా కానరాదు. ప్రేమలో ఎప్పుడు కూడా మంచి కోణమే మార్గంగా ఉంటేనే స్వచ్ఛత సాధ్యం.
Also Read: Anasuya Photo Gallary : అనసూయ షాకింగ్ లుక్.. భర్తతో ఇలా చేస్తూ..