https://oktelugu.com/

 Cancer : క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఇవే..

ప్రేగు లేదా మూత్రాశయ అలవాట్లలో మార్పులు కూడా కామన్ గా వస్తుంటాయి. మూత్రం లేదా మలంలో రక్తం, తరచుగా మూత్రవిసర్జన లేదా మలబద్ధకం/విరేచనాలు అవుతుంటే కూడా మీరు జాగ్రత్త పడాల్సిందే. ఈ విషయాన్ని కూడా అసలు నెగ్లెట్ చేయకండి.

Written By: Swathi Chilukuri, Updated On : November 19, 2024 10:38 am
Cancer symptoms

Cancer symptoms

Follow us on

Cancer :  ఆడవారు తమ ఆరోగ్యాన్ని ఎక్కువగా పట్టించుకోరు. మగవారు కూడా కొన్ని సార్లు నిర్లక్ష్యం చేస్తారు. వారు నిర్లక్ష్యం చేసే చిన్న సమస్యలే తీవ్రమైన సమస్యలకి దారి తీస్తుంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంట్లోని వారందరి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా అవసరం. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. వీటికి సంబంధించిన లక్షణాలను మనం పట్టించుకోకపోతే అవి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. మగవారికి, ఆడవారికి వివిధ రకాల క్యాన్సర్లు వస్తుంటాయి. అయితే ఈ క్యాన్సర్లు వచ్చేకంటే ముందే వాటి లక్షణాలను గుర్తిస్తే జాగ్రత్త పడవచ్చు.

బరువు తగ్గడం: ఆహారం లేదా వ్యాయామంలో మార్పులు లేకుండా ఆకస్మిక బరువు తగ్గడం కూడా క్యాన్సర్ కి సంకేతం అంటున్నారు నిపుణులు. సడన్ గా బరువు తగ్గితే మాత్రం కాస్త అనుమానించాల్సిందే. ఈ విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఇది మాత్రమే కాదు నిరంతర అలసటగా కూడా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్నా సరే అలసట తీరదు. చాలా అలసటగా అనిపిస్తుంటుంది. ఎక్కువ అలిసి పోతుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. దీనికి కారణం తెలుసుకోండి. విశ్రాంతి తీసుకున్నా లేదంటే ఎలాంటి శారీరక శ్రమ లేకున్నా సరే అలిసి పోతుంటే కూడా అనుమానించాల్సిందే.

ప్రేగు లేదా మూత్రాశయ అలవాట్లలో మార్పులు కూడా కామన్ గా వస్తుంటాయి. మూత్రం లేదా మలంలో రక్తం, తరచుగా మూత్రవిసర్జన లేదా మలబద్ధకం/విరేచనాలు అవుతుంటే కూడా మీరు జాగ్రత్త పడాల్సిందే. ఈ విషయాన్ని కూడా అసలు నెగ్లెట్ చేయకండి. దీర్ఘకాలిక నొప్పి వస్తుంటే కూడా చాలా మంది కామన్ అనుకుంటారు. వయసు పెరుగుతుంది కదా వస్తుంటాయి అని లైట్ తీసుకుంటారు. కానీ ఒకసారి వైద్యుని వద్దకు వెళ్తే ఎలాంటి సమస్య ఉండదు. త్వరగా బయట పడవచ్చు. సో వెన్ను, పొత్తికడుపు లేదా కీళ్ల వంటి ప్రాంతాల్లో కంటిన్యూగా మీకు నొప్పి అనిపిస్తే మాత్రం ఈ విషయంలో జాగ్రత్త పడటం చాలా అవసరం అని గుర్తు పెట్టుకోండి. లేదంటే తర్వాత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

చర్మం స్వరూపంలో మార్పులు కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. అసాధారణ పుట్టుమచ్చలు, పుండ్లు నయం కాకపోవడం, లేదా చర్మం రంగులో మార్పులు రావడం వంటివి కూడా అనుమానించాల్సినవే. వీటి విషయంలో జాగ్రత్త ముఖ్యం అంటున్నారు నిపుణులు. చర్మ సమస్యలు, పుండ్లు, అధికంగా పుట్టుమచ్చలు ఒకేసారి రావడం వంటివి తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అసాధారణ గడ్డలు లేదా వాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంపై గడ్డలు కొనసాగుతుంటాయి. లేదా కాలక్రమేణా ఇవి పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. నిరంతర దగ్గు లేదా బొంగురుపోవడం వంటి లక్షణాలు ఉంటే నార్మల్ జలుబు, దగ్గు అని లైట్ తీసుకోవద్దు. దగ్గు లేదా వాయిస్ మార్పు మూడు వారాల కంటే ఎక్కువ కాలం ఉండదు. ఇలాంటి పరిస్థితి మీకు కంటిన్యూగా కంటిన్యూ అవుతుంటే మాత్రం అనుమానించాల్సిందే.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..