Drinking Hot Water In Night : నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. నీరు లేకపోతే ఈ భూమి మీద ఏ ప్రాణి కూడా బ్రతకదు. ఆహారం కంటే నీరు అనేది చాలా ముఖ్యమైనది. అయితే చల్లని నీరు కంటే వేడి నీరుతో బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. రోజూ ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు వేడి నీరు తాగితే శరీరంలోని మలినాలు అన్ని పోయి చాలా హాయిగా ఉంటారు. అయితే కేవలం ఉదయం మాత్రమే కాదు. రాత్రి పూట నిద్రపోయే ముందు కూడా గ్లాసు వేడి నీరు తాగడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సాధారణంగా రోజుకి 4 లీటర్లు నీరు తప్పనిసరిగా తాగాలి. లేకపోతే చాలా నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయి. బాడీ డీహైడ్రేషన్ అయి.. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. అయితే రోజూ నిద్రపోయే ముందు వేడి నీరు తాగితే శరీరానికి బోలెడన్నీ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.
రాత్రి పూట నిద్రపోయే ముందు వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో శరీర రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రోజూ ఇలా నీరు తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిపోతాయి. అలాగే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. వేడి నీరు తాగడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీంతో మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఉదయం పూట మల విసర్జన ఫ్రీగా అవుతుంది. అధిక బరువు ఉన్నవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు నీరుతో బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడం కోసం మీరు ఎలాంటి మందులు వాడకుండా వేడి నీరుతో సింపుల్‌గా తగ్గించుకోవచ్చు. అలాగే నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. రాత్రిపూట గ్లాసు వేడి నీరు తాగితే బాగా నిద్ర కూడా పడుతుంది.
రాత్రి పూట వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి కూడా బయటపడవచ్చు. కడుపు నొప్పి, అజీర్తి, ఎసిడిటీ సమస్యలు కూడా వేడి నీటితో తగ్గుతాయి. వేడి నీరు తాగడం ఇష్టం లేకపోతే చల్లగా చేసుకుని కూడా తాగవచ్చు. వీలైతే రోజూ వేడి నీరు మాత్రమే తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల కిడ్నీలో రాళ్లు, మలబద్దకం, అర్షమొలలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది. స్కిన్ చాల నీట్‌గా అవుతుంది. ఎలాంటి ముడతలు లేకుండా యవ్వనంగా కనిపిస్తారు. అయితే రాత్రిపూట వేడి నీరు లేదా చల్లని నీరు ఎక్కువగా తాగకూడదు. ఒక గ్లాసు మాత్రమే తాగాలి. ఎందుకంటే ఎక్కువగా నీరు తాగితే తరుచుగా మూత్రం వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి రాత్రి పూట తక్కువగా మాత్రమే వేడి నీరు తీసుకోండి.