https://oktelugu.com/

Keerthy Suresh : హీరోయిన్ కాక ముందు ఆ పని చేసిన కీర్తి సురేష్… ఆమె మొదటి సంపాదన ఎంతో తెలుసా?

కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సౌత్ టు నార్త్ వరుస సినిమాలతో కీర్తి సురేష్ బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన కోలీవుడ్ మూవీ రఘు తాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హిందీ భాషను వ్యతిరేకించే మహిళగా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు ప్రశంసలు దక్కాయి. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే సినిమాల్లోకి రాకముందు కీర్తి సురేష్ ఏం చేసేదో తెలుసా?

Written By:
  • S Reddy
  • , Updated On : August 25, 2024 / 04:27 PM IST

    Keerthy Suresh

    Follow us on

    Keerthy Suresh : బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఈ సినిమాలో నటనకు గాను నేషనల్ అవార్డు అందుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తుంది. ఓ వైపు స్టార్ హీరోలకు జంటగా కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంది.

    నాని హీరోగా నటించిన దసరా చిత్రంలో డీ గ్లామరస్ రోల్ లో కీర్తి సురేష్ కనిపించింది. ఈ సినిమాలో కీర్తి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దసరా మంచి విజయం సాధించింది. నాని కెరీర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా దసరా ఉంది. అలాగే బాలీవుడ్ లో కూడా కీర్తి పాగా వేయాలని చూస్తుంది. హిందీలో ‘ బేబీ జాన్ ‘ సినిమాలో నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. డిసెంబర్ 25న ఈ చిత్రం ధియేటర్స్ లోకి రానుంది.ప్రస్తుతం ఆమె చేతిలో రివాల్వర్ రీటా, కన్నెవెడి అనే రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి.

    అంతేకాకుండా తెలుగులో ఉప్పు కప్పు రంబు అనే సినిమా చేస్తుంది. సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉంటే .. కీర్తి సురేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మొదటి జీతం ఎంత .. సినిమాల్లోకి రాకముందు ఏం పని చేసేది అనే విషయాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన మొదటి జీతం రూ. 500 అని కీర్తి సురేష్ వెల్లడించింది. హీరోయిన్ కాకముందు ఫ్యాషన్ షోలలో బట్టలు సరి చేసే పని చేసిందట. ఇందుకోసం ఆమెకు రూ. 500 ఇచ్చారని కీర్తి సురేష్ తెలిపింది.

    కీర్తి సురేష్ తల్లి మేనక ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె తండ్రి సురేష్ సైతం పరిశ్రమకు చెందినవాడే. అందుకే కీర్తి సురేష్ పసిప్రాయంలోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసింది. ఇక కీర్తి వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమెపై తరచూ ఎఫైర్ రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. హోమ్లీగా ఉండే కీర్తి పై ఎందుకు ఇలాంటి పుకార్లు వస్తాయో అర్థం కాదు. ఆ మధ్య నేను సింగిల్ కాదని చెప్పి కీర్తి సురేష్ షాకిచ్చింది.