Married Life: అనురక్షిత శృంగారం ఎంత ప్రమాదమో తెలుసా?

  Married Life : మనదేశంలో చాలా మంది అనురక్షిత శృంగారంలో పాల్గొంటున్నారు. పెళ్లి కాకుండా శృంగార జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇటీవల కాలంలో సహజీవనం పేరుతో చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. అనురక్షిత శృంగారంలో పాల్గొంటున్నారు. దీని వల్ల వారి జీవితం కష్టాల పాలు అవుతున్నా పట్టించుకోవం లేదు. ఎలాంటి రక్షణ లేకుండా శృంగారంలో పాల్గొంటే కొన్ని రకాల వ్యాధులకు కూడా కారణంగా నిలుస్తున్నారు. శృంగారంలో కండోమ్ వాడకుండా ఉండటం వల్ల గర్భం దాల్చే […]

Written By: Srinivas, Updated On : April 20, 2023 1:03 pm
Follow us on

 

Married Life

Married Life : మనదేశంలో చాలా మంది అనురక్షిత శృంగారంలో పాల్గొంటున్నారు. పెళ్లి కాకుండా శృంగార జీవితానికి అలవాటు పడుతున్నారు. ఇటీవల కాలంలో సహజీవనం పేరుతో చాలా మంది ఇదే తప్పు చేస్తున్నారు. అనురక్షిత శృంగారంలో పాల్గొంటున్నారు. దీని వల్ల వారి జీవితం కష్టాల పాలు అవుతున్నా పట్టించుకోవం లేదు. ఎలాంటి రక్షణ లేకుండా శృంగారంలో పాల్గొంటే కొన్ని రకాల వ్యాధులకు కూడా కారణంగా నిలుస్తున్నారు. శృంగారంలో కండోమ్ వాడకుండా ఉండటం వల్ల గర్భం దాల్చే ప్రమాదం ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా రోజు పదిలక్షలకు పైగా ఇలా జబ్బుల బారిన పడుతున్నారు. శృంగారంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడమే కారణంగా నిలుస్తోంది. అనురక్షిత శృంగారం తరువాత మూత్ర విసర్జన కచ్చితంగా చేస్తేనే మంచిది. జననేంద్రియాల ప్రాంతంలో మిగిలిపోయిన ద్రవాలను తొలగించుకోవాలి. యూరినరీ ఇన్ఫెక్షన్ ను నివారించడానికి వీలవుతుంది. అనురక్షిత శృంగారంలో పాల్గొంటే రెండు వారాల తరువాత గనేరియా, క్లామిడియా వంటి లైంగిక వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంటుంది.

మూత్ర విసర్జన చేసేటప్పుడు అసాధారణ ఉత్పర్గ, నొప్పి, పీరియడ్స్ మధ్య రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. అనురక్షిత శృంగారంతో ఏర్పడే జబ్బులకు గైనకాలజిస్ట్ తో పరీక్షలు చేయించుకుని చికిత్సలు తీసుకోవడం ఉత్తమం. అనురక్షిత శృంగారం అంత మంచిది కాదని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పలు రోగాలకు దగ్గరవుతున్నారు. సిఫిలిస్ మూడు నెలల తరువాత ఆరు నెలల తరువాత మళ్లీ టెస్టులు చేయించుకోవడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు కలగడానికి ఆస్కారం ఉంటుంది.

 

ఒకవేళ ఎయిడ్స్ ఉన్న వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకుంటే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. మందుల రూపంలో పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొపిలాక్సిస్ చేయించుకోవడం మంచిది. హెచ్ఐవీ ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఇది సాయపడుతుంది. ఇంకా అవాంఛిత గర్భం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గర్భనిరోధక మాత్రలు వాడినా ఫలితం ఉండదు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్న దృష్ట్యా అనురక్షిత శృంగారం విషయంలో అందరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దానికి మొగ్గు చూపడం నష్టాలే కలిగిస్తుంది.