Kondapindi Leaf : మన ప్రకృతిలో ఎన్నో రకాల ఆకులు, మొక్కలు, కాయలు, పువ్వులు లభిస్తాయి. వాటితో ఎన్నో రోగాలను నయం చేసుకోవచ్చు. మన పూర్వీకులు అదే చేశారు. ఇంగ్లిష్ మందులు లేకముందు చెట్ల మందు వాడుకుని తమ రోగాలు లేకుండా చేసుకున్నారు. కానీ ఇప్పుడు మనకు జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా ఇంగ్లిష్ మందులు వేసుకోవడం ఉపశమనం పొందడం. ఇదే జరుగుతోంది. చెట్లు వాటి ఉపయోగాలను దాదాపుగా మరచిపోయాం. అందుకే మనకు ఈ బాధలు వస్తున్నాయి.
కొండపిండి ఆకు
కొండపిండి ఆకుతో మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని పాపాణబేది అని కూడా అంటారు. అంటే రాళ్లను కూడా కరిగిస్తుందని అర్థం. కొండపిండి లేదా తెలగపిండి చెట్టు అని కూడా పిలుస్తుంటారు ఇది మనకు ప్రకృతిలో దొరుకుతుంది. ఇందులో కొన్ని గుణాలు ఉన్నాయి. అందుకే ఇది కనబడితే వదలకుండా తెచ్చుకుని వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
కిడ్నీలో రాళ్లు
కొండపిండి మొక్కతో ఆరోగ్య సమస్యలన్ని దూరం అవుతాయి. కిడ్నీలో సమస్యలతో బాధపడేవారు దీంతో ఆ సమస్యను దూరం చేసుకోవచ్చు. దీనికి కొండపిండి ఆకులను శుభ్రం చేసి నీటిలో వేసి మరిగించాలి. ఆకులు దొరకకపోతే ఆయుర్వేద దుకాణాలలో దీనిపొడిని కూడా అమ్ముతారు. పొడిని వేడి నీటిలో వేసి మరిగించి తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆ ఆకుల కషాయం తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
అంగస్తంభన సమస్యకు చెక్
మగవారిలో అంగస్తంభన సమస్య ఉంటే కూడా దీంతో దూరం చేసుకోవచ్చు. కొండపిండి ఆకులను మెత్తగా నూరి రసం తీసి అందులో జీలకర్ర వేసుకుని తాగడం వల్ల అంగస్తంభన సమస్య పోతుంది. కొండపిండి ఆకులను పప్పులో కూడా వేసుకుంటారు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆయుర్వేదంలో మనకు ఎన్నో రకాల చిట్కాలు కనిపిస్తుంటాయి. వాటిని వాడుకోవడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు లేకుండా పోతాయి.