Banana Benefits: అరటి పండులో ఎన్ని లాభాలో తెలుసా?

మూత్రపిండాల పనితీరును కూడా ఇది మెరుగు పరుస్తుంది. కిడ్నీలు సరిగా పనిచేయడానికి అరటి ఎంతో మేలు చేస్తుంది. అరటి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. అరటి పండ్లలో విటమిన్లు, మెగ్నిషియం, కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి.

Written By: Srinivas, Updated On : July 4, 2023 2:02 pm

Banana Benefits

Follow us on

Banana Benefits: పండ్లలో మేటిగా పేర్కొనేది అరటి పండు. ఇది అన్ని కాలాల్లో లభిస్తుంది. ఇందులో ఖనిజాలు, ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో మన శరీరానికి ఆరోగ్యకరమైన పండుగా చెబుతుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల జీర్ణక్రియ మెండుగా ఉంటుంది. మనం తీసుకున్న ఆహారాలు జీర్ణం కావాలంటే అరటి పండు ఉపయోగపడుతుంది. అరటిలో ఉండే డైటరీ ఫైబర్ మనకు చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది.

ఒక అరటి పండులో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అరటి పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మానసిక స్థితి మెరుగు పడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అండగా నిలుస్తుంది. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తపోటుని నియంత్రిస్తాయి. గుండె జబ్బులు ఉన్న వారు దీన్ని తీసుకుంటే గుండె జబ్బుల ముప్పు 27 శాతం తగ్గుతుంది. ఇలా అరటిపండు మనకు చాలా మేలు చేస్తుంది.

మూత్రపిండాల పనితీరును కూడా ఇది మెరుగు పరుస్తుంది. కిడ్నీలు సరిగా పనిచేయడానికి అరటి ఎంతో మేలు చేస్తుంది. అరటి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. అరటి పండ్లలో విటమిన్లు, మెగ్నిషియం, కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఉపయోగపడతాయి. కీళ్ల నొప్పులు తగ్గిస్తాయి.

అరటి పండ్లలో మనకు ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. అరటి పండులో పోషకాలు మెండు. దీంతో వీటిని తరచు తీసుకోవడం మంచిదే. కానీ ఎక్కువ మొత్తంలో తినకూడదు. మితంగా తింటేనే బలం కలుగుతుంది. అధికంగా తినడం వల్ల కష్టాలే వస్తాయి. అందుకే జాగ్రత్తగా అరటిపండ్లు తినడం మంచిది. అల్పాహారంగా వీటిని తీసుకోవద్దు. ఏదైనా తిన్న తరువాత వీటిని తినడం శ్రేయస్కరం.