Health Tips: ఉడకబెట్టిన వేరుశనగల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

స్వీట్ల మాదిరి చేసుకొని తింటారు. అయితే వేరు శనగను ఉడకబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిది అంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకోండి.

Written By: Swathi Chilukuri, Updated On : May 2, 2024 1:44 pm

Benefits of boiled peanuts

Follow us on

Health Tips: వేరుశనగ ఉపయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. పలు రకాల వంటకాల్లో కూడా వేరుశనగను ఉపయోగిస్తారు. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొందరు స్నాక్స్ లాగా తింటే మరికొందరు వేయించుకొని తింటారు. మరికొందరు ఇతర స్వీట్ల మాదిరి చేసుకొని తింటారు. అయితే వేరు శనగను ఉడకబెట్టి తినడం వల్ల ఆరోగ్యానికి మరింత మంచిది అంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకోండి.

మెదడు ఆరోగ్యం.. వేరుశనగ తినడం వల్ల మెదడు షార్ప్ గా ఉంటుందట. బ్రెయిన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఉడకబెట్టిన పల్లీలు తింటే మెదడు పనితీరు మెరుగుపడటమే కాదు యాక్టీవ్ గా ఉంటుందట. మతిమరుపు సమస్య తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలకు ఇవ్వడం వల్ల బ్రెయిన్ పెరుగుదల బాగుంటుంది అంటున్నారు నిపుణులు.

బరువు నియంత్రణ.. ఉడకబెట్టిన పల్లీల వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. వీటిలో కేలరీలు తక్కువగా, ఫైబర్, ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా తీసుకున్నా కడుపు నిండిన భావన ఉంటుంది. దీని వల్ల ఆహార పదార్థాలు తీసుకోరు కాబట్టి వెయిట్ లాస్ అవుతారు.

యాంటీ ఆక్సిడెంట్లు.. ఉడకబెట్టిన వేరుశనగ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల చర్మానికి, ఆరోగ్యానికి, జుట్టుకు మంచిది. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అదే విధంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను కూడా తగ్గిస్తాయట.

బ్లడ్ షుగర్.. ఉడకబెట్టిన పల్లీలు తినడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది అంటున్నారు నిపుణులు. చక్కెర స్థాయిలను తగ్గించి ప్రోటీన్, ఫైబర్ మెండుగా ఉండి తక్కువ క్యాలరీలు లభిస్తాయి. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఉడకబెట్టిన పల్లీలు తినడం చాలా మంచిది.