https://oktelugu.com/

Cat(Tiger) Breeds : ఈ 40 రకాల పిల్లి(పులి) జాతుల గురించి మీకు తెలుసా?

Cat(Tiger) Breeds పులి..భారతీయ జాతీయ జంతువు. మన దేశానికే కాకుండా బంగ్లాదేశ్, మలేషియా, దక్షిణ కొరియా దేశాలకు కూడా పులి జాతీయ జంతువు.. పులిలో గాంభీర్యం, రాజసం ఉంటాయి కాబట్టే మిగతా జంతువులు దాన్ని చూసి భయపడతాయి. పూర్వకాలంలో రాజులు వారి జండాలపై పులి చిత్రాలను చిహ్నాలుగా ఉపయోగించేవారు. పులులు అధికంగా నివసిస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో 47 అభయారణ్యాలు ఉన్నాయి.. పులి శరీరంలో ఉన్న చారలు ఏ ఒక్కటి మరొకదానితో […]

Written By:
  • Rocky
  • , Updated On : January 8, 2023 / 08:03 PM IST
    Follow us on

    Cat(Tiger) Breeds పులి..భారతీయ జాతీయ జంతువు. మన దేశానికే కాకుండా బంగ్లాదేశ్, మలేషియా, దక్షిణ కొరియా దేశాలకు కూడా పులి జాతీయ జంతువు.. పులిలో గాంభీర్యం, రాజసం ఉంటాయి కాబట్టే మిగతా జంతువులు దాన్ని చూసి భయపడతాయి. పూర్వకాలంలో రాజులు వారి జండాలపై పులి చిత్రాలను చిహ్నాలుగా ఉపయోగించేవారు. పులులు అధికంగా నివసిస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. మన దేశంలో 47 అభయారణ్యాలు ఉన్నాయి.. పులి శరీరంలో ఉన్న చారలు ఏ ఒక్కటి మరొకదానితో పోలి ఉండవు.. అచ్చం మన చేతి వేలిముద్ర లాగా. పులి శరీరంపై ఉన్న మచ్చలు వేటికవి ప్రత్యేకంగా ఉంటాయి. భారత్, రష్యా, భూటాన్, టర్కీ దేశాల్లో పులులు ఎక్కువగా ఉంటాయి. 1913 నుంచి పులులు ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా ఉండేవి.. గడిచిన 100 సంవత్సరాలలో పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అడవులు తగ్గిపోవడం, వేటగాళ్ల వల్ల 2010 నాటికి పూల సంఖ్య భారత్ లో 3200 కు పడిపోయింది.. పులి గరిష్ట ఆయుష్షు 26 సంవత్సరాలుగా ఉంటుంది.. ఇక 19వ శతాబ్దం నుంచి తెల్ల పులుల గురించి ప్రస్తావన ఉంది. ఇక తెలుగు నాట నివసించే పులుల్లో అరుదైన జన్యువు ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆ జన్యువు ఆ పులులకు వాటి తల్లిదండ్రుల ద్వారా లభిస్తుంది.. ప్రతి పదివేల పుట్టుకలలో ఒకసారి మాత్రమే ఇటువంటి జన్యువు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక తెల్ల పులి ప్రత్యేక ఉపజాతి కాదు. కేవలం వర్ణ బేధం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న తెల్ల పులులు బెంగాల్ పులుల్లో భాగమే. పులులు ఎక్కువగా ఒంటరిగా జీవించేందుకు ఇష్టపడతాయి.. సింహంతో పోల్చినప్పుడు పులి దట్టమైన అడవుల్లో జీవించేందుకు ప్రాధాన్యమిస్తుంది.. పులులు నీటిలో నాలుగు మైళ్ళ వరకు ఈదుకుంటూ వెళ్లగలవు.

    ఇన్ని రకాలు ఉన్నాయా?

    పులి.. ఈ రెండు అక్షరాల పేరు వినిపిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. అదే సమయంలో పరాక్రమానికి చిహ్నంగా మనసులో మెదులుతుంది. వాస్తవానికి మీలో చాలామంది పులిని జూ లోనో,ఎనిమల్ ప్లానేట్ చానెల్ లోనో చూసి ఉంటారు. కొందరు ఏ కెన్యా లోనో, మరి ఇతర దేశంలో సఫారీ కి వెళ్ళినప్పుడు చూసి ఉంటారు. పులి అంటే మీలో చాలామంది పెద్ద పులి, చిరుత పులి మాత్రమే అనుకుంటారు. కానీ పులుల్లో లెక్కకు మిక్కిలి రకాలు ఉన్నాయి. కొంత మంది పరిశోధకులు లెక్కిస్తే అవి 40 రకాలని తేలింది.

    అడవి పిల్లులు మొత్తం 40 జాతులు

    శ్రీలంకలోని చిన్న రస్టీ-మచ్చల పిల్లి నుంచి రష్యన్ ఫార్ ఈస్ట్ లో నివసించే భారీ సైబీరియన్ పులి వరకు, ప్రపంచంలో 40 రకాల అడవి పిల్లులు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటీ ఒక్కో లక్షణాన్ని కలిగి ఉంటాయి. మీలో చాలా మందికి సింహాలు, పులులు, జాగ్వర్లు, చిరుతపులులు మాత్రమే తెలిసే ఉంటుంది. అయితే మిగతా రకాల గురించి ఒక లుక్కేయండి.

    1. పెద్ద పిల్లి జాతులు – పాంథెర వంశం
    1.1 పులి (పాన్థెర టైగ్రిస్)
    1.2 సింహం (పాంథెర లియో)
    1.3 చిరుతపులి (పాంథెర పార్డస్)
    1.4 జాగ్వార్ (పాంథెర ఓంకా)
    1.5 మంచు చిరుత (పాంథెర అన్సియా)
    1.6 మేఘావృతమైన చిరుతపులి (నియోఫెలిస్ నెబులోసా)
    1.7 సుండా క్లౌడెడ్ చిరుతపులి (నియోఫెలిస్ డయార్డి)
    2. చిన్న పిల్లి జాతులు
    2.1 బోర్నియో బే పిల్లి (కాటోపుమా బాడియా)
    2.2 ఆసియాటిక్ గోల్డెన్ క్యాట్ (కాటోపుమా టెమ్మిన్కి)
    2.3 మార్బుల్డ్ క్యాట్ (పార్డోఫెలిస్ మార్మోరాటా)
    2.4 సర్వల్ (లెప్టైలరస్ సర్వల్)
    2.5 ఆఫ్రికన్ గోల్డెన్ క్యాట్ (కారకల్ ఔరాటా)
    2.6 కారకల్ (కారకల్ కారకల్)
    2.7 ఓసెలాట్ (చిరుతపులి పర్దాలిస్)


    2.8 మార్గే (లియోపార్డస్ వీడీ)
    2.9 కొలోకోలో (చిరుతపులి కోలోకోలో)
    2.10 ఉత్తర ఒన్సిల్లా (లియోపార్డస్ టైగ్రినస్)
    2.11 దక్షిణ ఒన్సిల్లా (చిరుతపులి గుట్టులస్)
    2.12 గినా (లియోపార్డస్ గిగ్నా)
    2.13 జియోఫ్రోయ్ పిల్లి (లియోపార్డస్ జియోఫ్రోయి)
    2.14 ఆండియన్ పిల్లి (లియోపార్డస్ జాకోబిటా)
    2.15 కెనడా లింక్స్ (లింక్స్ కెనాడెన్సిస్)
    2.16 ఐబీరియన్ లింక్స్ (లింక్స్ పార్డినస్)
    2.17 యురేషియన్ లింక్స్ (లింక్స్ లింక్స్)
    2.18 బాబ్‌క్యాట్ (లింక్స్ రూఫస్)
    2.19 ప్యూమా


    2.20 చిరుత (అసినోనిక్స్ జుబాటస్)
    2.21 జాగ్వరుండి (హెర్పైలురస్ యగౌరౌండి)
    2.22 పల్లాస్ పిల్లి (ఓటోకోలోబస్ మాన్యుల్)
    2.23 రస్టీ-మచ్చల పిల్లి (ప్రియోనైలురస్ రుబిగినోసస్)
    2.24 ఫ్లాట్-హెడ్ పిల్లి (ప్రియోనైలరస్ ప్లానిసెప్స్)
    2.25 చేపలు పట్టే పిల్లి (ప్రియోనైలురస్ వివర్రినస్)
    2.26 మెయిన్‌ల్యాండ్ చిరుతపులి పిల్లి (ప్రియోనైలురస్ బెంగాలెన్సిస్)
    2.27. సుండా చిరుత పిల్లి (ప్రియోనైలురస్ జవానెన్సిస్)
    2.28 అడవి పిల్లి (ఫెలిస్ చౌస్)


    2.29 నల్ల పాదాల పిల్లి (ఫెలిస్ నిగ్రిప్స్)
    2.30 ఇసుక పిల్లి (ఫెలిస్ మార్గరీట)
    2.31 చైనీస్ పర్వత పిల్లి (ఫెలిస్ బైటి)
    2.32 ఆఫ్రికన్, ఆసియాటిక్ అడవి పిల్లి (ఫెలిస్ లైబికా)
    2.33 యూరోపియన్ అడవి పిల్లి (ఫెలిస్ సిల్వెస్ట్రిస్)

    -ఇవీ అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి

    4.ఫెలిడే (పిల్లులు) కుటుంబానికి సంబంధించినవి.
    5. వైల్డ్ క్యాట్స్‌పై మరిన్ని పెద్ద పిల్లి జాతులు – పాంథెర వంశానికి చెందినవి. ఇవే కాకుండా భూమిపై అత్యంత ఆకర్షణీయమైన జంతువులు, కొన్ని అంతరించిపోతున్నాయి. పాంథెరినే ఉపకుటుంబానికి చెందిన వాటిని పెద్ద పిల్లులుగా పేర్కొంటున్నారు. 320 కిలోల బరువున్న సైబీరియన్ పులి ప్రపంచంలోనే అతిపెద్ద పిల్లి. పాపం, ఈ పులి కూడా అంతరించిపోతున్న పెద్ద పిల్లి. గత శతాబ్దం మొదటి అర్ధభాగంలో, టర్కీలో, ఇండోనేషియాలోని బాలి, జావా దీవులలో పులులు నివసించాయి. ఈ మూడు ఉపజాతులు ఇప్పుడు అంతరించిపోయాయి. దక్షిణ చైనా పులి తిరిగి రాలేని స్థితిని దాటింది. మిగిలిన ఐదు ఉపజాతులు క్షీణించే దశలో ఉన్నాయి.