Sleep disorder symptoms: ప్రస్తుత కాలంలో ఎవరికి.. ఎప్పుడు.. ఎలాంటి వ్యాధి వస్తుందో తెలియని పరిస్థితి. అయితే వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు అనే వార్తలు ఎక్కువగా వింటున్నాం.. కొందరు పదేళ్ల వయసు నిండిన వారు సైతం హార్ట్ ప్రాబ్లమ్స్ ను ఎదుర్కొంటున్నారు. మరికొందరు ఎప్పటిలాగే అందరితో కలిసి ఉండి ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అయితే ఉదయం కాకుండా ఎక్కువగా రాత్రి సమయంలోనే గుండెపోటుకు గురయ్యే సమస్యలపై వింటున్నాం. అయితే రాత్రి సమయంలోనే ఎక్కువగా గుండెపోటు వస్తుందని కొందరికి సందేహం రావొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కారణాలు ఉన్నాయని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆ కారణాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
కొంత మందికి ఫ్యాన్, ఏసీ ఉన్నా కూడా చెమటలు పడుతూ ఉంటాయి. ఈ చెమటలు వస్తున్నాయంటే శరీరంలో ఏదో మార్పు జరుగుతుందని గుర్తించాలి. దీనిని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. రక్త పంపిణీలో సమస్యలు ఉన్నప్పుడు ఇలా అధికంగా చెమటలు వస్తుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం సమస్యలు ఉన్నా కూడా గుండె సమస్యలు ఉన్నట్లే అని గుర్తించాలి. ఒక్కోసారి అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడం.. లేదా ఛాతి బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కూడా గుండెపోటును సూచించే లక్షణాలు అనుకోవచ్చు. అలాగదే ఎగమ చేతి భుజం, మెడ, దవడ వెున్న వరకు విస్తరించవచ్చు.
ఒక్కోసారి నిద్రలో ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో ఎటువంటి గాలి ఆడలేదన్నట్లు తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా నిద్ర లేస్తుంటారు. ఈ లక్షణాలు ఉన్నవారు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు గుర్తించాలి. గుండెలో రక్త ప్రవాహంలో సమస్యలు ఏర్పడినప్పుడు శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. దీనినే స్లీప్ ఆప్నియా అని కూడా అంటారు. అనుకోకుండా ఒకేసారి వాంతులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురైనా గుండెలో సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. ఇలాంటి సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఒక్కోసారి గుండె హార్ట్ బీట్ ఎక్కువగా ఉంుటంది. అంటే నిద్రలో బలంగా కొట్టుకోవడం.. అకస్మాత్తుగా ఎక్కువ లేదా తక్కువగా ఉండడం.. నిద్ర మధ్యలో ఒక్కసారి లేచి భయపడడం వంటి సమస్యలు కూడా హార్ట్ ఎటాక్ లక్షణాలుగా పేర్కొనవచ్చు. అధిక అలసట లేదా రాత్రి మధ్యలో శరీర బరువు పెరిగినట్లు అనిపించడం వంటి సమస్యలు కూడా ఈ వ్యాధికి సంకేతాలు. అయితే ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే ఉదాసీనంగా తీసుకోవద్దు. అయితే సొంతంగా మందులు వాడకుండా వైద్యుల సలహాతో మాత్రమే మెడిసిన్ తీసుకోవాలి.