Trisha bomb threat: ఈమధ్య కాలంలో ఆకతాయిలు సెలబ్రిటీలకు బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ అయ్యాయి. బాలీవుడ్ లో మాత్రమే కాదు, సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్నటువంటి ప్రముఖులకు కూడా ఈ బెదిరింపులు సర్వసాధారణం అయిపోయాయి. ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha Krishnan) ఇంటికి లేటెస్ట్ గా బాంబు బెదిరింపులు రావడం కోలీవుడ్ లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. చెన్నై లోని ఆళ్వార్ పేట లో నివసిస్తున్న త్రిష ఇంట్లో బాంబులు ఉన్నట్టు ఒక ఈ మెయిల్ ద్వారా సమాచారం అందింది. దీంతో త్రిష వెంటనే పోలీసులకు సమాచారం తెలపడం తో, పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిఫ్యూజల్ టీం, త్రిష ఇంటికి చేరుకొని సుమారుగా రెండు గంటల పాటు త్రిష ఇంట్లో సోదాలు నిర్వహించారు. అన్ని విధాల సోదాలు నిర్వహించగా, ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేవని నిర్ధారించారు. ఇది ఒక బూటక బెదిరింపు చర్యలు అని పోలీసులు నిర్ధారించారు.
త్రిష కి ఇలాంటి బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కొత్తేమి కాదు. గతం లో మూడు సార్లు బాంబ్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇది నాల్గవ సారి అట. అయితే ఈ బెదిరింపులను తేలికగా తీసుకుంటే మొదటికే మోసం రావొచ్చు. ఫేక్ సమాచారం అని పోలీసులు పట్టించుకోవడం మానేసిన సమయం లో అకస్మాత్తుగా బాంబు దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే పోలీస్ సైబర్ ట్రాకింగ్, భద్రతా చర్యలను మరింత పటిష్టం చేశారు. త్రిష ఇంటికి మాత్రమే కాకుండా, చుట్టూ పక్కన ఉన్న జనాలకు కూడా ఎలాంటి ఆపద కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకీ ఈ బెదిరింపు కాల్స్ చేసింది ఎవరు?, ఎందుకు చేశారు?, వాళ్ళ లక్ష్యం ఏంటి? అనేది త్వరలోనే విచారణలో కనిపెడుతామని పోలీసులు మీడియా తో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే 5 పదుల వయస్సుకు ఈమె దగ్గర పడుతున్నప్పటికీ కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ముందుకు దూసుకు పోతోంది. ఈమెతో పాటు సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన ఎంతో మంది హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయ్యారు. సినిమాలకు దూరం అయ్యారు. మరికొంతమంది హీరోయిన్స్ అయితే క్యారక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యారు. కానీ త్రిష మాత్రం కుర్ర హీరోయిన్స్ తో పోటీ పడుతూ వరుసగా అవకాశాలను సంపాదిస్తూ ముందుకెళ్తోంది. రీసెంట్ గా ఆమె కమల్ హాసన్ హీరో గా నటించిన ‘తగ్ లైఫ్’ చిత్రం తో మన ముందుకొచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇక ఈమె హీరోయిన్ గా మెగాస్టార్ చిరంజీవి తో కలిసి నటించిన ‘విశ్వంభర’ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.