Health Tips Telugu : ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కన్నా ఉత్తమమైన పని మరొకటి ఉండదు. మారుతున్న కాలానుగుణంగా అనారోగ్య సమస్యలతో వయస్సుతో సంబందం లేకుండా మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మనం తినే ఆహరం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది అనడంలో సందేహం లేదు. మంచి ఆహారాన్ని అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటూ రోగాల బారిన పడకుండా ఉండొచ్చు. అలానే సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోకుంటే కూడా ఇబ్బందులు వస్తాయి అని మీకు తెలుసా… ఉదయం వేళ పరగడుపున కొన్ని ఆహార పడర్దాలను తినడం ఛాలా ప్రమాదకరం. అలా చేస్తున్నట్లైతే మీరు డేంజర్ లో ఉన్నట్లే. ఆ పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం…
ఖాళీ కడుపుతో షర్బత్ తాగితే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది భావిస్తారు. చక్కెరను జీర్ణం చేయడానికి ఉదయం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదని తెలుసుకోవాలి. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అందుకే ఉదయం పూట ఖాళీ కడుపుతో పంచదార తీసుకోకూడదు.
ఉదయాన్నే శీతల పానీయాలు తీసుకోవడం ఎప్పుడూ మంచిది కాదు. ఖాళీ కడుపుతో శీతల పానీయాలు లేదంటే సోడా వాటర్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇందువల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
నారింజ, నిమ్మకాయలు కూడా ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. ఇవి కూడా కార్బోనేటేడ్ పదార్థాల లాగే అదే ప్రభావాన్ని చూపుతాయి. ఉదయాన్నే ఈ పండ్లు తింటే ఎసిడిటీ పెరుగుతుంది.
ఉదయాన్నే వేడిగా ఉండే మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. ఖాళీ కడుపుతో గరం మసాలా తీసుకోవడం వల్ల గ్యాస్ పెరుగుతుంది.