PaniPuri: పాణీపూరీ.. ఈ పేరు వింటేనే చాలు చిన్న వారి దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ ఫిదా అయిపోతుంటారు. అయితే పానీపూరీ తింటే ఆరోగ్యానికి డేంజర్ అని ఎందరు డాక్టర్లు చెప్పినా ప్రజలు మాత్రం వినకుండా తింటూనే ఉన్నారు. ఇక పానీ పూరీ తిన్న తర్వాత ఆ నీటిని ఇంకొంచెం పోయించుకుని మరీ గటా గటా తాగేసి వావ్ సూపర్ అంటూ చెప్పేస్తుంటారు. అయితే వీరందరికీ ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ వచ్చేసింది.
వాస్తవానికి ఈ పానీపూరీ నీళ్లను ఇంట్లో తయారు చేసుకుంటే మంచిదే కానీ.. ఇప్పుడు మార్కెట్లో రెడీమేడ్ మిక్స్ డ్ పానీపూరీ పౌడర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో ఉప్పు రాళ్లు, ఎండిపోయిన అల్లంతో పాటు సిట్రిక్ యాసిడ్ లాంటి మివ్రమాలను కలుపుతారు. ఇందులో ఉప్పును కూడా ఎక్కువగా వాడేస్తుంటారు. దాంతో అది కాస్తా శరీరానికి హాని చేకూరుస్తుంది.
Also Read: నువ్వేంటి తల్లి ఇలా ఉన్నావ్.. ఆర్టీసీ డ్రైవర్‌ను ఇలా కొడతావా..!
కాగా ఈ నీళ్లను తాగితే మాత్రం త్వరగా బరువు పెరుగుతారు. బరువు తగ్గాలని చూసే వారికి మాత్రం ఇది నిజంగా చేదు వార్తే. ఉప్పు అధికంగా వాడిన నీళ్లను తాగితే ఈజీగానే బరువు పెరుగుతారు. పైగా ఒంట్లోకి ఎక్కువగా ఉప్పు చేరితే కీళ్ల నొప్పులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాగా పానీపూరీలో దాదాపు 329 కేలరీలు ఉంటాయి కాబట్టి.. ఇవి ఈజీగానే కొవ్వు పెరుగుదలకు దోహదపడుతాయంట.
ఇంకో విషయం ఏంటంటే.. మైదా పిండి, రవ్వతో తయారు చేసే పానీపూరీలు కూడా చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. వీటిని డీప్ ఫ్రై చేయడం వల్ల బాడీలో ఉష్ణోగ్రత పెరిగి హానికర టాక్సిన్లు ఒంటినిండా చేరుతాయని చెబుతున్నారు డాక్టర్లు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పానీపూరీలను దూరంగా పెట్టాలంటూ సూచిస్తున్నారు డాక్టర్లు.
Also Read: ఫస్ట్ నైట్ కు ఇచ్చిన గిఫ్ట్ ను నాగచైతన్యకు తిరిగిచ్చేసిన సమంత