Alcohol in Winter: తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న చలి వల్ల మద్యం అమ్మకాలు సైతం పెరుగుతున్నాయి. సాధారణంగా ఆల్కహాల్ ను, సిగరెట్ ను తాగడం వల్ల శరీరం వేడిగా మారుతుందని చాలామంది భావిస్తారు. ఈ కారణం వల్లే మద్యం తాగడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. శరీర ఉష్ణోగ్రతలను తగ్గించడంలో ఆల్కహాల్ ఎంతగానో సహాయపడుతుంది.
అయితే విస్కీ లేదా రమ్ తాగడం వల్ల మొదట శరీరం వేడెక్కినట్టు అనిపించినా తర్వాత చల్లగా మారుతుంది. చలిని తట్టుకునే శరీర సామర్థ్యాన్ని ఆల్కహాల్ బలహీనపరిచే అవకాశం ఉంటుంది. చలికాలంలో చాలామంది నీళ్లు తాగడం తగ్గించడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. తక్కువగా నీళ్లు తాగడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
Also Read: ఈ ఫోటోలో ఓ ప్రమాదకర పాము ఉంది.. ఎక్కడో కనుక్కోండి చూద్దాం!
చలికాలంలో నీళ్లు తక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సాధారణంగా చలికాలంలో శరీరం నుంచి చెమట కానీ నీరు కానీ బయటకు వచ్చే అవకాశం అయితే ఉండదనే సంగతి తెలిసిందే. అందువల్ల ఎక్కువ నీటిని తాగాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారు. చలికాలంలో గాలి పొడిగా ఉండటంతో పాటు గాలి నుంచి తేమ శరీరానికి చేరే ఛాన్స్ కూడా ఉండదు.
చలికాలంలో మద్యం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చలికాలంలో వేడిని తగ్గించుకోవడం కోసం మద్యం తాగేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది.
Also Read: చలికాలంలో మద్యం ఎక్కువగా సేవిస్తున్నారా అయితే ఎంత ప్రమాదమో తెలుసుకోండిలా?