Memory Power Tips: 2000 సంవత్సరానికి 2023 వరకు చాలా మార్పులు వచ్చాయి. 20 ఏళ్లల్లో కొత్త సాంకేతికం వెలుగులోకి వచ్చింది. దీంతో పాఠశాలల్లో విద్యా విధానం, కుటుంబ పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఈ తరుణంలో ఇప్పుడు పెరుగుతున్న పిల్లలు మెషిన్ లాగా చదువుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చదువుపైనే దృష్టిపెడుతున్నారు. ఇలా చదవడం వల్ల ఒక్కోసారి మెదడులో జరిగే కొన్ని చర్యల వల్ల జ్ఞాపక శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని కొందరు వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ముందు జాగ్రత్తగా వారిలో నిత్యం ఉత్సాహం మెదడు చురుకుగా పనిచేయడానికి ఈ 3 పద్ధతులను అనుసరించాలి. అవేంటో తెలుసుకుందాం..
నిద్ర:
స్కూల్ కెళ్లె పిల్లల మెదడు చురుకుగా ఉండాలి. అలా ఉంటేనే వారి ఇష్టంతో చదువుతారు. అందుకోసం వారి మెదడును యాక్టివ్ గా ఉంచేలా సరైన నిద్రకు అవకాశం ఇవ్వాలి. ఎంత ఎక్కువ సేపు నిద్రపోతే అంత యాక్టివ్ గా ఉంటారు. అలా అని ఉదయం 8 వరకు నిద్రించాలి అని కాదు. రాత్రి వీలైనంత వరకు 9 వరకు నిద్రిస్తే వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది. అందువల్ల వారిని టీవీ, మొబైల్ చూడ్డానికి తక్కువ అవకాశం ఇస్తూనే 9 వరకు నిద్రపోయేలా ప్రయత్నించాలి.
ఆకుకూరలు:
ఆకు కూరల్లో విలువైన పోషకాలు ఉంటాయి. పాలకూర, కొత్తిమీర వంటి వాటిని రోజూ ఉండేలా చూసుకోండి. వీటితో పాటు బీట్ రూట్, బచ్చలి కూర అప్పుడప్పుడు చేస్తూ ఉండండి. ఇందులో విటమిన్స్ తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల మెదడును అభివృద్ధి చేస్తాయి.
నట్స్, ఎగ్స్:
కిరాణం షాపుల్లో కనిపించే చిప్స్ ప్యాకెట్ అంటే పిల్లలకు చాలా ఇష్టం.అయితే ఇదే సమయంలో వారికి డ్రై ఫ్రూట్స్ అలవాటు చేయండి. ఇందులో ఉండే పోషకాలు వారికి వివరించండి. వీటిని ప్రతి రోజూ ఎంతో కొంత ఇవ్వడం వల్ల వారిలో అదనపు శక్తి లభిస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి యాక్టివ్ గా ఉంటారు. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు గ్రుడ్లు ఇచ్చే ప్రయత్నం చేయండి.
ఆటలు:
పిల్లలకు చదువు మాత్రమే కాకుండా ఆటల్లో నైపుణ్యం ఉండేలా చూసుకోండి. ఇంటి పక్కన ఉండే పిల్లలతో ఆడుకునే స్వేచ్ఛను కల్పించండి. లేదా ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులు వారితో బోర్డ్ గేమ్స్ లాంటివి ఆడుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వారి మెదడు చురుకుగా పనిచేస్తుంది. వీకెండ్ లేదా హాలీడే సమయాల్లో ఏదైనా పార్క్ లేదా ఓపెన్ ప్లేసులోకి వెళ్లి వారితో కాసేపు ఆడడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.