Jailer Collections: సూపర్ స్టార్ రజినీకాంత్ మార్కెట్ రేంజ్ ఏంటో జైలర్ తో ప్రూవ్ అయ్యింది. హిట్ సినిమా పడితే భాషా భేదం లేకుండా బాక్సాఫీస్ గల్లంతని తేలిపోయింది. జైలర్ వసూళ్ల సునామీ కొనసాగుతుంది. జైలర్ మూవీ హక్కులు చాలా తక్కువ ధరకు అమ్మారు. తమిళనాడులో రూ. 60 కోట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ. 12 కోట్లకు కొన్నారు. వరల్డ్ వైడ్ జైలర్ రూ. 124 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 125 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన జైలర్ ఈ మొత్తం ఫస్ట్ వీకెండ్ కే లేపేసింది.
17 రోజులకు జైలర్ రూ. 557.70 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఇక షేర్ విషయానికి వస్తే రూ. 272.75 కోట్లు. అంటే అక్షరాలా రూ. 148.175 కోట్ల లాభాలు జైలర్ పంచింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 75 కోట్ల గ్రాస్, రూ. 44 కోట్ల షేర్ వసూలు చేసింది. అంటే కేవలం ఏపీ/తెలంగాణా డిస్ట్రిబ్యూటర్స్ కి జైలర్ రూ. 22 కోట్ల లాభాలు పంచింది. దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రధాన ఏరియాల్లో విడుదల చేశారు.
దిల్ రాజు జైలర్ తో భారీగా లాభపడ్డారు. శాకుంతలం నష్టాల నుండి బయటపడేందుకు జైలర్ ఉపయోగపడింది. నిజానికి జైలర్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కథ ఏమంత గొప్పగా లేదన్న మాట వినిపించింది. అయితే రజినీకాంత్ ప్రెజెన్స్, అనిరుధ్ మ్యూజిక్, మోహన్ లాల్-శివ రాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ సినిమాకు ప్రాణం పోశాయి. మొత్తంగా రజినీకాంత్ కి జైలర్ ఊహించని కమ్ బ్యాక్ ఇచ్చింది.
జైలర్ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆయన గత చిత్రం బీస్ట్ ప్లాప్ కావడంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. జైలర్ సక్సెస్ తో విమర్శకుల నోళ్లు మూపించాడు. కోలీవుడ్ కి భారీ హిట్ కట్టబెట్టాడు. ఈ మధ్య కాలంలో పొన్నియిన్ సెల్వన్ మాత్రమే రూ. 500 కోట్ల వసూళ్లు దాటింది. జైలర్ తో ఆ మూవీ వసూళ్లను అధిగమించారు. రమ్య కృష్ణ, తమన్నా, సునీల్ కీలక రోల్స్ చేశారు.