Obesity: ఇటీవల కాలంలో జీవనశైలి మారుతోంది. జంక్ ఫుడ్స్ కు అలవాటు పడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యల్లో చిక్కుకుంటున్నారు. బేకరీ ప్రొడక్ట్స్ తో అనర్థాలున్నాయని తెలిసినా మానడం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడుతున్నారు. అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. నివారణ చర్యలు తీసుకోకున్నా నిబంధనలు మాత్రం పాటించడం లేదు. దీంతో ఊబకాయంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మనం జాగ్రత్తలు తీసుకోకపోతే ఊబకాయం వల్ల ఇతర సమస్యలు కూడా చుట్టుముడతాయి.
తప్పించుకోవడం ఎలా?
ఊబకాయం నుంచి తప్పించకోవడం ఎలా అనే దానిపై ఎవరు దృష్టి సారించడం లేదు. క్రమశిక్షణ లేని తిండితో అనర్థాలు వస్తాయని తెలిసినా మానడం లేదు. విచ్చలవిడిగా ఫిజాలు, బర్గర్లు తింటున్నారు. ఫలితంగా అధిక బరువు పెరుగుతున్నారు. దీనివల్ల ఇతర రోగాలకు దగ్గరవుతున్నారు. జిహ్వ చాపల్యాన్ని చంపుకోవడం లేదు. దీంతోనే ఊబకాయం ముప్పు వస్తోంది. ఊబకాయం వల్ల మనం అధిక బరువును మోయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తలు పడకపోతే ముప్పే.
ఏం చేయాలి?
ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజు ఓ ఇరవై నిమిషాల పాటు సైకిల్ తొక్కితే సరిపోతుంది. ఈ రోజుల్లో ఎవరు కూడా సైకిల్ తొక్కడం లేదు. అందరు వాహనాలనే వాడుతున్నారు. దీంతో ఊబకాయం ఎక్కువ మందిలో వేధించే సమస్యగా అవుతోంది. రోజురోజుకు ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వచ్చే పన్నెండేళ్లలో ఊబకాయుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది.
సైకిల్ తొక్కడం..
సైకిల్ తొక్కడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. జిమ్ లో కసరత్తులు చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో ఇరవై నిమిషాలు సైకిల్ తొక్కితే అంతే లాభం కలుగుతుంది. ఎక్కువ కేలరీలు ఖర్చు కావాలంటే సైకిల్ తొక్కడం వల్ల జరుగుతుంది. ఈ నిజం తెలుసుకుని మసలుకోవడం వల్ల ఊబకాయం దరికి చేరనివ్వదు. ఊబకాయాన్ని దూరం చేసుకుంటేనే ఆరోగ్యం మనకు మేలు చేస్తుంది. అంతేకాని ఊబకాయం బారిన పడితే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టడం సహజమే. దీంతో మనం ఊబకాయం బారిన పడకుండా చూసుకోవడమే ఉత్తమం.