Foods Avoid With Tea: ప్రతిరోజూ ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే చాలా మందికి రోజు గడవదు. ఈ క్రమంలోనే టీ తాగుతూ ఉంటారు. టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తూ ఉంటారు. అయితే చాలా మంది టీ అంటే ఇష్టం ఉండడంచేత గంటగంటకు తాగుతూ ఉంటారు. ఇలా అధిక మొత్తంలో టీ తాగటం వల్ల ఎంతో ప్రమాదమని నిపుణులు వెల్లడించారు. అదే విధంగా ఎక్కువ సార్లు టీ తాగడం మాత్రమే కాకుండా టీ తాగిన తర్వాత పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. మరి ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తినకూడదు అనే విషయానికి వస్తే…
టీ తాగిన తర్వాత వెంటనే అధిక మొత్తంలో ప్రొటీన్లు కలిగి ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినకూడదు.టీలో ఉన్నటువంటి టానిన్లు ముదురు గోధుమ రంగును అందిస్తాయి. అలాగే చాలామంది గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. గ్రీన్ టీలో కూడా క్యాటెచిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అదే రకమైన టానిన్‌లు. ఈ విధమైనటువంటి టానిన్‌లు ఎక్కువ మొత్తంలో ఐరన్,ప్రోటీన్ శోషణను నిరోధించగలదు.అందుకోసమే టీ తాగిన తర్వాత వెంటనే ప్రోటీన్లు ఐరన్ అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తినకూడదు.
Also Read: Asthma: మీరు ఆస్తమాతో బాధ పడుతున్నారా.. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయాలివే?
అదేవిధంగా పచ్చికూరగాయలు ఆకు కూరలు కూడా టీ తాగడానికి ముందు లేదా టీ తాగిన తర్వాత కూడా తినకూడదు. పచ్చి ఆకు కూరలు కూరగాయలలో ఉన్నటువంటి గోయిట్రోజెన్‌లు నిజానికి థైరాయిడ్ గ్రంధి ద్వారా అయోడిన్ శోషణను నిరోధిస్తూ అయోడిన్ లోపానికి కారణం అవుతుంది కనుక బ్రోకలీ వంటి ఆకుకూరలను పచ్చి కూరగాయలను టీ తాగిన తర్వాత లేదా టీ తాగడానికి ముందు తీసుకోకూడదు.
వీటితోపాటు మొలకెత్తే గింజలను కూడా తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మొలకెత్తిన గింజలలో ఎక్కువ భాగం ఫైటేట్ ఉంటాయి.భాస్వరం యొక్క మూలకంగా పని చేస్తుంది కనుక టీ తాగే ముందు తాగిన తర్వాత మొలకెత్తిన గింజలను కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Antibiotics defects: విచ్చలవిడి యాంటీ బయాటిక్స్‌తో చాలా ప్రమాదం.. హెచ్చరిస్తున్న వైద్యులు?