Powder : ఈ పొడి తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు మాయమవుతాయి తెలుసా?

Powder : ప్రస్తుత కాలంలో అందరికి చిన్న వయసులోనే రోగాలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కీళ్లు, మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. వాపులు, నడుస్తుంటే శబ్ధాలు రావడం వంటి సమస్యలు బాధిస్తున్నాయి. దీని వల్ల వారు సరిగా నడవలేకపోతున్నారు. అడుగు తీసి అడుగు వేయాలంటేనే గగనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య నుంచి దూరం కావడానికి ఎన్నో మందులు వాడాల్సి వస్తోంది. మనం తీసుకునే ఆహారాలే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. అధిక బరువు, కాల్సియం లోపం వంటి […]

Written By: Srinivas, Updated On : March 30, 2023 5:07 pm
Follow us on

Powder : ప్రస్తుత కాలంలో అందరికి చిన్న వయసులోనే రోగాలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కీళ్లు, మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయి. వాపులు, నడుస్తుంటే శబ్ధాలు రావడం వంటి సమస్యలు బాధిస్తున్నాయి. దీని వల్ల వారు సరిగా నడవలేకపోతున్నారు. అడుగు తీసి అడుగు వేయాలంటేనే గగనంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్య నుంచి దూరం కావడానికి ఎన్నో మందులు వాడాల్సి వస్తోంది. మనం తీసుకునే ఆహారాలే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. అధిక బరువు, కాల్సియం లోపం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయి.

మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి అనేక మందులు, ఏవో ఆయింట్ మెంట్లు వాడుతున్నారు. ఇంగ్లిష్ మందుల కంటే మన ఇంట్లోనే తయారు చేసుకునే సులభమైన చిట్కాతో మోకాళ్ల నొప్పులు చిటికెలో దూరమవడం ఖాయం. దీనికి అవిసె గింజలు, నువ్వులు, కళోంజి విత్తనాలు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. వీటిని సమపాళ్లలో తీసుకుని దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. దీన్ని గాలి తగలకుండా ఓ పాత్రలో భద్రపరచుకోవాలి.

ఈ పొడిని రోజు ఒక టీ స్పూన్ తీసుకుని ఒక గ్లాస్ పాలలో కలిపి తాగాలి. ఇలా 15 రోజులు తాగాలి. మళ్లీ వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ 15 రోజులు తాగితే మోకాళ్లు, కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి. ఇందులో ఉండే కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి12, ఫ్యాటీ యాసిడ్లు ఎన్నో పోషకాలను అందిస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా కావడానికి కారణమవుతాయి. ఈ పొడి వాడకం వల్ల మనకు దీర్ఘ కాలిక రోగాల నుంచి ఉపశమనం కలిగించడంలో దోహదపడుతుంది.

ఈ పొడిని తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు కూడా దూరం అవుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో దక్కుతాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. మోకాళ్ల నొప్పులకు చెక్ పెడుతుంది. ఇలా ఈ పొడి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అందుకే దీన్ని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags