
Kitchen: ప్రస్తుత కాలంలో జీవితం ఉరుకుల పరుగుల మయం అయిపోయింది. అందరు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదీ పట్టించుకోవడం లేదు. మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే కూడా కష్టపడి పనిచేయందే ఏదీ కాదు. ఈ నేపథ్యంలో చెడు ప్రభావాలు మనపై పడకుండా ఉండాలంటే మనం కొన్ని చర్యలు తీసుకోకుంటే వీలు కాదు. కొందరు ఎంత కష్టపడి పనిచేసిన ఫలితం ఉండదు. మరికొందరు ఏ పనిచేయకపోయినా బాగా కలిసొస్తుంది. దీంతో వారు జీవితంలో ముందుంటారు.
వాస్తు చిట్కాలు పాటించకపోతే..
మనం కట్టుకునే ఇల్లు వాస్తు ప్రకారం లేకపోతే ఇబ్బందులు వస్తాయి. వాస్తు చిట్కాలు పాటించినట్లయితే మనకు ఏ దోషాలు లేకుండా పోతాయి. మన పూర్వీకుల సలహాలు, సూచనలు పాటిస్తే మనకు సమస్యలు రావు. ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకురావడం అంత మంచిది కాదని తెలుసుకుని వాటిని తీసుకురాకుండా ఉండటమే మంచిది. కొన్ని రకాల వస్తువులను తీసుకురావడం వల్ల సంతోషాలు ఉండవు.
మట్టి కుండలో నీరు పోసి..
వాస్తు చిట్కాలు సులభంగానే ఉంటాయి. వాటి కోసం మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. చిట్కాలను పాటించడం వల్ల నష్టం కూడా ఏమీ లేదు. లాభమే ఎక్కువగా ఉంటుంది. వాస్తు చిట్కాలను పాటించి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో మట్టితో తయారు చేసిన కుండలో నీరు పోసి ఉంచినట్లయితే మంచి ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మట్టితో తయారు చేసిన కలశాన్ని నీళ్లతో నింపి ఉంచినా మంచి జరుగుతుందని చెబుతారు.
మన పూర్వీకుల ఆశీస్సులు
నీళ్లతో నింపిన మట్టి కుండలో మన పూర్వీకులు ఉంటారని నమ్ముతుంటారు. దీంతో వారి ఆశీస్సులు మనపై ఉంటుందని విశ్వసిస్తారు. అందుకే మట్టి కుండలో నీరు పోసి వంటింట్లో పెట్టుకోవడం వల్ల మనకు శుభాలు దక్కుతాయంటున్నారు. వంటగదిలో ఉన్న దోషాలు పోవాలంటే ఈ చిట్కా పాటిస్తే సరిపోతుంది.

ఆగ్నేయ దిశలో..
వాస్తు ప్రకారం దోషాలు లేకుండా చూసుకుంటే మనకు ఎలాంటి ఆపదలు రాకుండా ఉంటాయి. వాస్తు చిట్కాలు పాటించినట్లయితే ముప్పు వాటిల్లదు. దీంతో మనకు మంచి ఫలితాలు వస్తాయి. వాస్తు ప్రకారం ఇల్లు ఉండేలా చూసుకోవాలి. వంట గది ఆగ్నేయ దిశలో ఉంచుకుంటేనే ప్రయోజనాలు దక్కుతాయి. ఈశాన్య దిక్కులో వంట గది ఉంచుకోవడం శ్రేయస్కరం కాదు. ఇలాంటి చిన్న చిట్కాలు పాటించి మన ఇల్లుకు ఆపదలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.