Hair Fall : జుట్టు రాలే సమస్యకు ఇది వాడితే వారం రోజుల్లోనే పరిష్కారమవుతుంది తెలుసా?

Hair Fall : ప్రస్తుత కాలంలో జుట్టు ఓ సమస్యగా మారుతోంది. చిన్న వయసులోనే జుట్టు రాలడం, తెల్లబడటం జరుగుతుంది. దీంతో నలుగురిలో కలిసేందుకు ఇష్టపడటం లేదు. మనం తీసుకునే ఆహారాల ప్రభావంతో మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడంతో బట్టతల వస్తోంది. వెంట్రుకలు తెల్లబడటంతో వృద్ధుల్లాగా కనిపిస్తున్నారు. దీంతో ఏవేవో ఇంగ్లిష్ మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే. కానీ శాశ్వత పరిష్కారం లభించడం లేదు. దీనికి మన ప్రకృతిలో ఎన్నో మార్గాలున్నా […]

Written By: Srinivas, Updated On : March 20, 2023 12:18 pm
Follow us on

Hair Fall : ప్రస్తుత కాలంలో జుట్టు ఓ సమస్యగా మారుతోంది. చిన్న వయసులోనే జుట్టు రాలడం, తెల్లబడటం జరుగుతుంది. దీంతో నలుగురిలో కలిసేందుకు ఇష్టపడటం లేదు. మనం తీసుకునే ఆహారాల ప్రభావంతో మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే జుట్టు ఊడిపోవడంతో బట్టతల వస్తోంది. వెంట్రుకలు తెల్లబడటంతో వృద్ధుల్లాగా కనిపిస్తున్నారు. దీంతో ఏవేవో ఇంగ్లిష్ మందులు వాడినా తాత్కాలిక ఉపశమనమే. కానీ శాశ్వత పరిష్కారం లభించడం లేదు. దీనికి మన ప్రకృతిలో ఎన్నో మార్గాలున్నా వాటిని పాటించడం లేదు.

వేలకు వేలు..

జుట్టు నల్లబడటానికి, ఊడిపోకుండా ఉండటానికి ఎంతో డబ్బు ఖర్చుచేస్తున్నారు. అయినా వారికి తగిన పరిష్కారం దొరకడం లేదు. జుట్టుకు కలర్ వేస్తే అది రెండు రోజుల్లోనే దాని ప్రభావం చూపిస్తుంది. తరువాత మళ్లీ యథాతథ స్థితే. దీంతో ఏం చేయాలో తెలియడం లేదు. ఎంత డబ్బు ఖర్చు చేసినా సంతృప్తి మిగలడం లేదు. కలర్లు ఎంత సేపు ఉంచుతాయి. తరువాత మన గుట్టు బయట పడాల్సిందే. ఈ నేపథ్యంలో ఆంగ్ల వైద్యం ఎంత చేసినా అంతే. కానీ మన ప్రకృతి విధానంలో ప్రయత్నిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

బొప్పాయి ఆకుతో..

జుట్టు రాలిపోకుండా ఉండేందుకు, తెల్ల జుట్టును నల్లగా చేసుకునేందుకు మన ప్రకృతి విధానంలో బ్రహ్మాండమైన మార్గాలు ఉన్నాయి. కాకపోతే మనవారు పాటించడం లేదు. ఆంగ్ల వైద్యానికే ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా వేలాది రూపాయలు వృథా చేసుకుంటున్నారు. దీనికి గాను ఒక మూడు బొప్పాయి ఆకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడగాలి. తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో వేసి అందులో ఓ గ్లాస్ నీరు పోసి ఓ పదినిమిషాలు మరిగించాలి. తరువాత వడకట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకుని గిలక్కొట్టి దాన్ని ఓ పాత్రలో భద్రం చేసుకోవాలి.

ఎలా వాడుకోవాలి

దీన్ని ప్రతి రోజు స్నానం చేయడానికి ఓ గంట ముందు జుట్టుకు బాగా పట్టించి మర్దన చేసుకోవాలి. ఓ గంట ఆగి షాంపూతో కానీ కుంకుడు కాయతో కానీ స్నానం చేస్తే సరి. ఇలా వరుసగా వారం రోజులు చేస్తే జుట్టు ఊడిపోయే సమస్య, జుట్టు తెల్లబడే ఇబ్బందులు అన్ని తొలగుతాయి. సులభంగా ఉండే ఈ పరిష్కార మార్గాన్ని అందరు ఆచరించి తమ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో ఇంత మంచి చిట్కా ఉందని తెలుసుకుని వాడుకుని తమ జుట్టు సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం మీదే.