Curd : పెరుగులో ఇవి కలుపుకుని తింటే కీళ్లనొప్పులు మాయమవుతాయి తెలుసా?

Curd : ఇటీవల కాలంలో జబ్బులు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండె జబ్బులు వంటివి వేధిస్తున్నాయి. మనం తినే ఆహారమే మనకు జబ్బులు రావడానికి కారణాలు అవుతున్నాయి. అందరు తెల్ల బియ్యానికి అలవాటు పడ్డాక రోగా సంఖ్య విస్తరిస్తోంది. పాతికేళ్లకే గుండెపోటు వస్తుందంటే పరిస్థితి ఎందాక వెళ్లిందో అర్థమవుతోంది. అయినా మన వారు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇంకా వైట్ ప్రొడక్స్ట్స్ నే నమ్ముకుంటున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్నారు. వైద్యుల దగ్గరకు వెళ్లి […]

Written By: Srinivas, Updated On : April 5, 2023 10:16 am
Follow us on


Curd :
ఇటీవల కాలంలో జబ్బులు పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండె జబ్బులు వంటివి వేధిస్తున్నాయి. మనం తినే ఆహారమే మనకు జబ్బులు రావడానికి కారణాలు అవుతున్నాయి. అందరు తెల్ల బియ్యానికి అలవాటు పడ్డాక రోగా సంఖ్య విస్తరిస్తోంది. పాతికేళ్లకే గుండెపోటు వస్తుందంటే పరిస్థితి ఎందాక వెళ్లిందో అర్థమవుతోంది. అయినా మన వారు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇంకా వైట్ ప్రొడక్స్ట్స్ నే నమ్ముకుంటున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని అమ్ముకుంటున్నారు. వైద్యుల దగ్గరకు వెళ్లి జబ్బులకు మందులు తీసుకుంటున్నారు. కానీ ఆహార అలవాట్లు మాత్రం మార్చుకోవడం లేదు. ఆంగ్లంలో ఓ సామెత ఉన్నట్లు ఎ స్మాల్ కీ ఓపెన్ ద బిగ్ డోర్ ఒక చిన్న చిట్కా పెద్ద రోగాలను సైతం దూరం చేస్తుందని నమ్మడం లేదు.

ప్రస్తుత కాలంలో అందరిని వేధిస్తున్న సమస్య కీళ్ల నొప్పులు. యాబై ఏళ్లు రాకుండానే ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి. దీంతో నడవడానికే ఆపసోపాలు పడుతున్నారు. సమస్య ప్రారంభ దశలో ఉంటే చిట్కాలు ఉపయోగపడతాయి. కానీ రోగం ముదిరితే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే మరి. కీళ్ల నొప్పుల నివారణకు మనం చేయాల్సింది ఏంటంటే ఒక కప్పు పెరుగులో వేయించిన అవిసె గింజల పొడి కలుపుకుని తినడమే. ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ అవిసె గింజల పొడిని కలుపుకుని తింటే చాలు. ఈ చిట్కా మూడు రోజులు చేస్తే చాలు.

అవిసె గింజలను వేయించుకుని పొడి చేసుకుని భద్రపరచుకోవాలి. ఇది 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక కప్పు పెరుగులో స్పూన్ పొడి వేసుకుని తింటే కీళ్ల నొప్పులు మాయమవుతాయి. జాయింట్ల మధ్య సౌండ్ కూడా తగ్గుతుంది. ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. అందుకే రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కీళ్లు నొప్పులు లేకుండా పోతాయి. ఈ చిట్కా పాటిస్తే ఆ సమస్యతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది.

డయాబెటిస్ వేగంగా విస్తరిస్తోంది. దీన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి అందరు ఎంతో శ్రమిస్తున్నారు. వీరికి కూడా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పెరుగులో అవిసె గింజల పొడి వేసుకుని తాగడం వల్ల షుగర్ నియంత్రణలో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో డయాబెటిస్ రోగులు కూడా ఈ చిట్కాను ఉపయోగించుకుని చక్కెరను అదుపులో ఉంచుకోవచ్చు. దీని వల్ల సైడ్ ఎఫెక్టులు రాకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెజబ్బులు రాకుండా నిరోధిస్తుంది. ఇన్ని రకాల లాభాలున్నందున దీన్ని అందరు పాటించుకోవాలని సూచిస్తున్నారు.

Tags